వెన్న ఉండలు ఎలా చేయాలంటే..?
వెన్నలో విటమిన్ ఎ, ఇ, కె పుష్కలంగా ఉన్నాయి. క్యాన్సర్‌కు చెక్ పెట్టే బటర్‌ను తక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు కండరాలు పటిష్టంగా ఉంటాయి. శరీరానికి క్యాల్షియం, విటమిన్ డి అందిస్తుంది. అలాంటి బటర్‌తో ఉండలు చేస్తే ఎలా వుంటుందో చూద్దాం.వెన్న ఉండలకు కావాలసిన పదార్థాలు :బియ్యంపిండి - అర కిలో. నువ్వులు - 100 గ్రా. వాము - 2-3 చెంచాలు. నూనె - అర లీటరు.ఉప్పు - సరిపడినంత. కారం - సరిపడినంత. తయారీ విధానం :ముందుగా వాము నూరుకుని, నీళ్ళు మరిగించి అందులో ఉప్పు కారాలు జీలకర్ర, వాము వెయ్యాలి. బియ్యప్పిండిలో వెన్న వేసి కలిపి దానిని మరుగుతున్న నీళ్ళలోపోసి ఉండలు కట్టకుండా కలియబెడుతుండాలి. పిండి ఉడికాక దింపి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. మరో పాన్‌లో నూనె మరిగాక ఆ ఉండల్ని అందులో దోరగా వేయించుకోవాలి.