వింటర్లో క్యాబేజ్ పెప్పర్ సూప్‌తో బరువు తగ్గండి!
, గురువారం, 2 జనవరి 2014 (17:31 IST)
అసలే శీతాకాలం.. బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే వెంటనే ఈ సీజన్‌కు మంచి కాంబినేషన్‌గా క్యాబేజ్ పెప్పర్ సూప్ ట్రై చేయండి. క్యాబేజ్ పెప్పర్ సూప్‌కు కావలసిన పదార్థాలు:క్యాబేజీ తురుము - రెండు కప్పులు కార్న్ ఫ్లోర్ - రెండు టేబుల్ స్పూన్లు బ్లాక్ పెప్పర్ - రెండు టీ స్పూన్లు ఉప్పు, వెన్న - తగినంత క్యారెట్ తురుము - ఒక కప్పుఉల్లి తరుగు - అర కప్పు తయారీ విధానం: ముందుగా తరిగిన క్యాబేజీ, క్యారెట్ తురుములను కుక్కర్లో వేడిచేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని చేర్చాలి. ఇందులో కాస్త ఉప్పు చేర్చి మూడు లేదా 4 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి. తర్వాత ఓ పాన్‌లో కొద్దిగా బటర్ వేసి కరిగిన తర్వాత ముందుగా కుక్కర్‌లో ఉడికించి పెట్టుకొన్న వెజిటేబుల్స్ సూప్‌ను వేసి మిక్స్ చేయాలి. ఇందులో బ్లాక్ పెప్పర్, ఉప్పు చేర్చాలి. ఈ రెండూ కాస్త చిక్కగా మారుతుండగా అందులో కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకుని.. కార్న్ చిప్స్‌తో హాట్ హాట్‌గా సర్వ్ చేస్తే.. టేస్ట్ అదిరిపోవడమే కాదు.. మీ బరువు కూడా బాగా తగ్గుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు.