రుచికరమైన మష్రూమ్ వుండ్రాలు తయారు చేయడం ఎలా?
, బుధవారం, 21 డిశెంబరు 2011 (17:41 IST)
కావలసిన పదార్ధాలు:మష్రూమ్స్ - రెండు కప్పులు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ - తగినంత, నూనె - కప్పు, బంగాళాదుంపలు - రెండు, గుడ్లు - రెండు, బ్రెడ్‌పొడి - కప్పు, ఉప్పు - రుచికి తగినంత, ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు, వెల్లుల్లి రేకలు - నాలుగు, అల్లం ముక్కలు - చెంచా, కారం - అరచెంచా, మిరియాల పొడి - చిటికెడు, పసుపు - చిటికెడు, జీలకర్ర పొడి - అరచెంచా, గరంమసాలా - అరచెంచా.తయారు చేయు విధానం:పొయ్యిమీద బాణలి పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి వేడయ్యాక అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి వేయించాలి. తరువాత శుభ్రపరచుకున్న మష్రూమ్ ముక్కలు వేసి కలపాలి. అవి మెత్తగా అయిన తరువాత కాస్త కారం, పసుపు, మసాలా, జీలకర్రపొడి, ఉప్పు తగినంత వేసి నాలుగు నిమిషాలయ్యాక దించేయాలి. ఉడికించిన బంగాళాదుంపలో మిరియాలపొడి, ఉప్పు వేసి చేత్తో చిన్న చిన్న ఉండలుగా చేయాలి. వాటి లోపల మష్రూమ్ మిశ్రమాన్ని ఉంచి మూసేయాలి. ఇలా తయారు చేసుకున్న వాటిని గిలక్కొట్టిన పచ్చి గుడ్డు మిశ్రమంలో ముంచి బ్రెడ్ పొడిలో అద్దాలి. చివరగా బాణలిలో నూనె పోసి వేడయ్యాక వాటిని వేయించుకోవాలి. గోధుమవర్ణంలోకి వచ్చాక దించేయాలి.