బ్రేక్ఫాస్ట్ కోసం అటుకుల సమోస!
, గురువారం, 13 జూన్ 2013 (18:07 IST)
కావల్సిన పదార్థాలు ముప్పావు కప్పు నీటిలో నానబెట్టిన అటుకులు, సమోసా పత్తీలు, ఒక టైబుల్ స్పూన్ నూనె, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఇంగువ, అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక టీ స్పూన్ పచ్చిమిరప కాయలు ముక్కలు, కొద్దిగా కరివేపాకు. వీటితో పాటు ఎండు బఠాణీ గింజలు, పావు టీ స్పూన్ పసువు, 2 టీ స్పూన్ల నిమ్మరసం, తగినంత పంచదార, ఉప్పు, కొత్తిమీర, తగినంత మైదా, వీటన్నింటినీ వేయించడానికి సరిపడ నూనె. ఎలా తయారు చేస్తారు? బాండిలో నూనె వేసి జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి బాగా కలియబెట్టాలి. అటుకులు, మొలకలు వచ్చిన బఠాణీ, పసుపు, నిమ్మరసం, పంచదార, ఉప్పువేసి కలపాలి. వీటిని ఐదారు నిమిషాల వరకు ఉడికించిన తర్వాత.. కొత్తమీర వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మనకు నచ్చిన సైజుల్లో చేసుకోవాలి. సమోసా ఆకారంలో తయారు చేసుకున్న ఒక్కో భాగాన్ని నడుమ ఉంచి మైదా పేస్ట్, అంచులకు పూసి నొక్కి మూసెయ్యాలి. ఇదేవిధంగా మిగిలిన సమోసాలను తయారు చేసుకుని వేడి నూనెలో వేయించి బాగా వేడి చేసి ఆరగిస్తే ఎంతో రుచికరంగా ఉంటాయి.