బెండకాయ వేపుడు ఎలా చేయాలి?
జ్ఞాపకశక్తిని పెంచే బెండకాయల్ని వారానికి రెండుసార్లు పిల్లలకు పెట్టడం మంచిదంటున్నారు న్యూట్రీషన్లు. బెండకాయను పులుసుల్లో వేస్తే ఇష్టపడి తినరు. అయితే వేపుళ్ల రూపంలో ఇష్టపడి తింటారు. అలాంటి బెండకాయ వేపుడు ఎలా చేయోలో చూద్దామా..కావలసిన పదార్థాలు:బెండకాయలు - పావు కిలో. నూనె - వేయించడానికి సరిపడినంత. కారం - సరిపడినంత. ఉప్పు - సరిపడినంత. తయారీ విధానం:బెండకాయలను వేపుడుకు వీలుగా ముక్కలుగా తరగాలి. బాణలిలో నూనె మరిగిన తర్వాత బెండకాయ ముక్కలు కొద్ది కొద్దిగా వేసి దోరగా వేయించి ఒక గిన్నెలో వేసుకోవాలి. తరువాత ముక్కలకు సరిపడినంత కారం, ఉప్పు, అరస్పూన్ నూనెలో వేయించి కలుపుకోవాలి.