"పాలక్ పలావ్"ను ఎలా తయారు చేస్తారు?
, మంగళవారం, 29 ఏప్రియల్ 2014 (12:36 IST)
కావలసిన పదార్థాలు :బాస్మతి బియ్యం.. రెండు కప్పులుపాలకూర.. 150 గ్రా.ఉల్లిపాయలు.. రెండుఅల్లం.. కాస్తంతవెల్లుల్లి.. 10 రేకలుమంచినీరు.. ఒక లీ.నూనె.. 3 టీ.జీడిపప్పులు.. 20పచ్చిమిర్చి.. 4గరంమసాలా.. ఒక టీ.యాలకులపొడి.. ఒక టీ.లవంగాల పొడి.. చిటికెడుఉప్పు.. మూడు టీ.నిమ్మరసం.. ఒక టీ.టొమోటో.. ఒకటి.తయారీ విధానం :పాలకూర, ఉల్లిముక్కలు, అల్లం, వెల్లుల్లిలకు కాసిన్ని నీళ్లు చేర్చి మిక్సీలో మెత్తగా రుబ్బి పక్కనుంచాలి. ఓ పాన్‌లో నూనె వేసి వేడి చేయాలి. జీడిపప్పు, బియ్యం వేసి రెండు నిమిషాలు వేయించాలి. పచ్చిమిర్చి, గరం మసాలా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క పొడులు, ఉప్పు వేసి బాగా కలపాలి.దాంట్లో సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి తక్కువ మంటమీద ఉడికించాలి. తరువాత మెత్తగా రుబ్బి పెట్టుకున్న పాలకూర పేస్టు కూడా జోడించి మరో పది నిమిషాలు సిమ్‌లో ఉంచాలి. చివరగా నిమ్మరసం పిండి ఓసారి గరిటెతో కలిపితే పాలక్ పలావ్ రెడీ.