Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పచ్చి బఠానీ బోండాలు టేస్ట్ చేయండి..!

Advertiesment
పచ్చి బఠానీ బోండాలు
FILE
బఠానీల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి బఠాణీలను కూరల్లో కాకుండా బోండాల్లా చేస్తే పిల్లలు ఇష్టపడి తింటారు. పచ్చి బఠాణీలతో బోండాలు ఎలా చేయాలో చూద్దాం..

కావలసిన పదార్థాలు :
పచ్చి బఠానీ గింజలు - అరకేజి.
మైదా - 250 గ్రా.
నిమ్మరసం - 3 టేబుల్‌ స్పూన్లు.
జీలకర్ర - 10 గ్రా.
ధనియాలు - 10 గ్రా.
కారం - 5 గ్రా.
గరం మసాల - 25 గ్రా.
కొత్తిమీర - 25 గ్రా.
ఉప్పు - రుచికి సరిపడా.
వేరుశనగ నూనె - వేగించడానికి తగినంత.

తయారీ విధానం :
ముందుగా మైదాలో అర టీ స్పూను ఉప్పు, ఒక టీ స్పూను నూనె వేసి నీటితో గట్టి ముద్దలా కలిపి అరగంటపాటు నానబెట్టాలి. పచ్చి బఠానీ గింజల్ని పొట్టు తీసి చేత్తో నలిపి ఒక గిన్నెలో వేయాలి. వీటికి మిగతా పదార్థాలన్నీ కూడా జతచేస్తూ బాగా కలపాలి.

మైదా ముద్దలోంచి కొద్దికొద్దిగా పిండి తీసుకుని మధ్యలో బఠానీ మిశ్రమాన్ని పెట్టి బోండాల్లా చేసుకుని కత్తితో చుట్టూ గాట్లు పెట్టుకోవాలి. వీటిని దోరగా వేగించి తీశాక కొద్దిసేపు టిష్యూ పేపర్‌పై ఉంచితే నూనెని పీల్చుకుంటుంది. తర్వాత వేడివేడి పచ్చి బఠానీ బొండాలను టమేటో సాస్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.

Share this Story:

Follow Webdunia telugu