దొండకాయతో ఊరగాయ ఎలా చేయాలి?
వర్షాకాలంలో ఊరగాయలు, వేపుళ్లంటే లొట్టలేసుకుని తింటాం. ఊబకాయానికి చెక్ పెట్టడంతో పాటు మధుమేహగ్రస్తులకు మంచి ఫలితాలనిచ్చే దొండకాయతో ఊరగాయ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. కావలసిన పదార్థాలు:దొండకాయలు : పావు కిలోనిమ్మరసం : అర కప్పుపసుపు : కొద్దిగాఉప్పు : ముప్పావు కిలోకారప్పొడి : అర కప్పుఆవ పిండి : పావు కప్పుమెంతి పిండి : చెంచాఎండు మిర్చి : నాలుగునూనె : సరిపడాపోపు సామాను : చెంచెడుఇంగువ : తగినంతతయారీ విధానం :లేత దొండకాయలను బాగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలకు కారప్పొడి, ఉప్పు, ఆవపిండి వేసి బాగా కలపాలి. తర్వాత నిమ్మరసం కూడా వేసి బాగా కలపండి. మూకుడులో ముక్కలకి సరిపడా నూనె పోసి ఇంగువ పోపు పెట్టి చల్లార్చి కలపాలి. ఇది పదిహేను నుంచి ఇరవై రోజుల వరకూ నిలువ ఉంటుంది.