"దానిమ్మ పచ్చడి"లో పోషకాలు మెండు..!!
కావలసిన పదార్థాలు :పుల్లటి దానిమ్మగింజలు... ఒక కప్పువేయించి పొట్టుతీసిన వేరుశెనగపప్పు.. అర కప్పుపండుమిరపకాయలు.. ఐదువెల్లుల్లి.. పది రేకలుజీలకర్ర.. 2 టీ.నూనె.. అర టీ.ఉప్పు.. రుచికి సరిపడాతయారీ విధానం :నూనెలో పండుమిర్చి, వెల్లుల్లి రేకలు, జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి వేయించాలి. మిక్సీలో వేరుశెనగ గింజలు, జీలకర్ర, మిర్చి, వెల్లుల్లి రేకలతో పాటు దానిమ్మగింజలు, ఉప్పు జతచేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇష్టమైతే మినప్పప్పు, ఆవాలు, కరివేపాకులతో తిరగమోత పెట్టుకోవచ్చు. లేకపోతే అలాగే అయినా తినవచ్చు. అంతే రుచికరమైన దానిమ్మపచ్చడి రెడీ. పోషకాలు మెండుగా ఉండే ఈ చట్నీని ఇడ్లీ దోశల్లోకే కాకుండా అన్నంలో కూడా కలిపి తినవచ్చు.