టమోటా పచ్చడి ఎలా చేయాలో మీకు తెలుసా..?
టమోటాను సిట్రస్ ఫ్రూట్ అంటారు. విటమిన్ సి పుష్కలంగా దాగివున్న టమోటాను వంటల్లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. టమోటాను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. టమోటాలో విటమిన్ సి మాత్రమే గాకుండా మేగ్నీషియం, ఫాస్పరస్, కాపర్‌లు కూడా ఉన్నాయి. కూరల్లో మాత్రమే గాకుండా టమోటాలను సలాడ్స్, శాండ్‌విచ్, కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు. ఇంకా వేసవిలో టమోటా పచ్చడి వంటివి కూడా ట్రై చేయొచ్చు. మరి టమోటా పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.కావాల్సిన పదార్థాలు :టమోటాలు : ఒక కిలోనూనె : తాలింపుకు సరిపడాఆవాలు : రెండు స్పూన్లుజీలకర్ర : ఒక టేబుల్ స్పూన్పచ్చి, ఎండు మిరపకాయలు : 15కరివేపాకు : రెండు రెబ్బలుశనగ పప్పు : 50 గ్రాములువెల్లుల్లి పాయలు : రెండుధనియాల పొడి : ఒక టేబుల్ స్పూన్చింతపండు గుజ్జు : 50 గ్రాములుఉప్పు : తగినంతమినపపప్పు : ఒక టెబుల్ స్పూన్తయారు చేయు విధానం : ముందుగా టమోటాలు కడిగి ముక్కలు కోసుకోవాలి. నూనె వేడిచేసి ఆవాలు వేసి చిటపటలాడాక జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు, శనగపప్పు, వెల్లుల్లి రేకులు, ధనియాల పొడి, చింతపండు గుజ్జు, ఉప్పు కలపాలి.(
విడిగా కొద్దిగా ఆవాలు, జీలకర్ర, రెండు ఎండు మిరపకాయలు, శనగపప్పు, కరివేపాకు తాలింపు కోసం ఉంచుకోవాలి.) తరిగిన టమోటో ముక్కలు వేసి ఐదునిమిషాలు వేయించి, చల్లారాక మెత్తగా రుబ్బుకోవాలి. మూకుడులో నూనె వేడి చేసి తాలింపు దినుసులన్నీ వేసి వేగాక పచ్చడిలో పోసి కలియబెట్టాలి.