క్యారట్ సూప్ ఎలా చేయాలి..?
విటమిన్ ఎ, మినరల్స్ పుష్కలంగా ఉన్న క్యారట్తో వర్షాకాలంలో సూప్ సిప్ చేస్తే ఎలా ఉంటుంది.. అయితే క్యారట్ సూప్ ఎలా చేయాలో చూద్దామా.. కావలసిన పదార్థాలు:
క్యారట్ - పావు కేజీఉల్లిపాయ - రెండు.
పెసరపప్పు - ఒక టేబుల్ స్పూన్.
వెన్న తీసిన పాలు - ఒక కప్పు. ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత. తయారీ విధానం:ముందుగా క్యారట్, ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. ఈ ముక్కల్లో పెసరపప్పు, మూడు టీ స్పూన్ల నీటిని వేసి ఫ్రెషర్ కుక్కర్లో ఉడికించాలి. ఇవన్నీ ఉడికిన తర్వాత గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి ఒంపుకోవాలి.ఇందులో వేడిపాలను వేసి బాగా కలపాలి. చివరగా ఉప్పు, మిరియాల పొడి కలిపి ఒక నిమిషం సేపు ఉడికించి దించేయాలి. దీనిని వేడివేడిగా సర్వ్ చేయాలి.