క్యాబేజీతో పరొటాలు తయారు చేయడం ఎలా....?
, గురువారం, 7 మార్చి 2013 (18:09 IST)
కావలసిన పదార్థాలు : క్యాబేజి సన్న తరుగు - 2 కప్పులుగోధుమపిండి - 3 కప్పులుపెరుగు - అరకప్పు ఉప్పు - రుచికి తగినంతపచ్చిమిర్చి సన్న తరుగు (గింజలు లేకుండా) : 1 టీ స్పూనుఅల్లం తరుగు - 1 టీ స్పూనుకరివేపాకు తరుగు - అరకప్పుఉల్లి తరుగు - అరకప్పు నెయ్యి - కాల్చడానికి సరిపడాఉప్పు - రుచికి తగినంత తయారు చేయు విధానం : ఒక పాత్రలో క్యాబేజీతో పాటు మిగతా పదార్థాలన్నీ వేసి ముద్దలా కలిపి పెట్టుకోవాలి. దీన్ని అరగంట పాటు నాననివ్వాలి. తర్వాత పరొటాలు చేసుకుని పెనంపై రెండువైపులా నెయ్యి రాస్తూ దోరగా కాల్చుకోవాలి. మంటని కాస్త తగ్గించి ఎక్కువసేపు పెనంపైన ఉంచితే కూరగాయ ముక్కలు పచ్చి వాసన రాకుండా ఉంటాయి. ఈ పరొటాలు టమోటో చట్నీతో బాగుంటాయి.