Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్తిమీరతో కొబ్బరి చట్నీ

Advertiesment
వంటకాలు శాకాహారం కొత్తిమీర కొబ్బరికాయలు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి జీలకర్ర నిమ్మరసం పంచదార ఉప్పు
కావలసిన పదార్థాలు :
కొత్తిమీర... రెండు కట్టలు
కొబ్బరికాయలు... చిన్నవి రెండు
అల్లం... పది గ్రా.
వెల్లుల్లి... పది గ్రా.
పచ్చిమిర్చి... 200 గ్రా.
జీలకర్ర... ఒక టీ.
నిమ్మరసం... రెండు టీ.
పంచదార... రెండు టీ.
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
కొబ్బరి చిప్పలను తురిమి ఉంచుకోవాలి. కొత్తిమీరను శుభ్రంగా కడిగి కోయాలి. పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కొబ్బరికోరు, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ కలిపి రుబ్బాలి. ఆ తరువాత ఉప్పు, పంచదార కూడా వేసి రుబ్బి, చివరగా నిమ్మరసం కలిపితే కొత్తిమీరతో కొబ్బరి చట్నీ సిద్ధమైనట్లే...! ఇది వేడి వేడి అన్నం, దోసెలు, ఇడ్లీలలోకి చాలా బాగుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu