కడాయ్ పనీర్ రోటీలను ఎలా తయారు చేస్తారు?
, సోమవారం, 21 ఏప్రియల్ 2014 (17:56 IST)
కావలసిన పదార్థాలు:పనీర్ - 200 గ్రాములు బటర్ - 50 గ్రా; ఉల్లిపాయ పేస్ట్ -200 గ్రాజీడిపప్పు పేస్ట్ - 10 గ్రా; టొమాటో పేస్ట్ - అరకప్పు పసుపు - అర టీ స్పూనుపంచదార - అర టీ స్పూనురెడ్ కలర్ - రెండు చుక్కలుఉప్పు - తగినంత; నీరు - కొద్దిగామిరప్పొడి - టీ స్పూను; కొత్తిమీర - కొద్దిగాజీరాపొడి - అర టీ స్పూనుమెంతిపొడి - అర టీ స్పూనునూనె - టీ స్పూను. తయారీ విధానం: ముందుగా స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేడయ్యాక పనీర్ ముక్కలను వేయించి పక్కన ఉంచుకోవాలి. తరవాత అదే బాణలిలో బటర్ వేసి కాగాక ఉల్లిపాయ పేస్ట్, జీడిపప్పు పేస్ట్, టొమాటో పేస్ట్ వేసి దోరగా వేయించాలి. గోధుమరంగులోకి వచ్చే దాకా వేయించిన తరవాత అందులో మిరప్పొడి, జీరాపొడి, పసుపు, మెంతిపొడి, పంచదార, రెడ్‌కలర్ చుక్కలు, తగినంత ఉప్పు వేసి వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి కాసేపు ఉడికించాలి. గ్రేవీలా అయ్యాక.. ముందుగా వేయించిన పనీర్ ముక్కలను ఆ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. కాసేపయ్యాక కొత్తిమీర వేసి దించేయాలి. కడాయ్ పనీర్ రెడీ.. ఈ గ్రేవీని రోటీలకు సైడిష్‌గా ఉపయోగించుకోవచ్చు.