ఆకుకూరలతో ఇడ్లీ తయారు చేయడం ఎలా?
ఆకుకూరల్లో ఎన్నో పోషకాలున్నాయి. వారానికి రెండు సార్లు ఆకుకూరలను తీసుకోవడం ద్వారా కంటిచూపు మెరుగవుతుంది. పిల్లల కంటి చూపు సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చును. మొత్తానికి పిల్లలు చదివే ప్రాయంలోనే కళ్ళద్దాలు వేసుకోవడం నుంచి తప్పించుకోవాలంటే ఆకుకూరలు తినాల్సిందే. కానీ ఆకుకూరలంటే పిల్లలు వద్దంటున్నారా., అయితే ఆకుకూరలతో ఇడ్లీ తయారు చేసి చూడండిఆకుకూరలతో ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు :మినప్పప్పు - కప్పుఇడ్లీ రవ్వ - రెండు కప్పులుపచ్చిమిర్చి - నాలుగుఉప్పు - రుచికి తగినంతతాలింపు దినుసులు - చెంచాపాలకూర, బచ్చలికూర, తోటకూర - ఒక్కోటి రెండు కట్టల చొప్పునకరివేపాకు - నాలుగురెబ్బలుఎండుమిర్చి - రెండుపచ్చిమిర్చి - ఒకటితయారు చేయు విధానం : ముందు రోజు ఉదయం మినప్పప్పు నానబెట్టుకోవాలి. సాయంత్రం రుబ్బుకొని రవ్వ, కలిపి పక్కన పెట్టుకోవాలి. మర్నాడు ఆకుకూరలను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. అందులో కాస్త ఉప్పు చేర్చి ఆవిరి మీద ఇడ్లీలు ఉడికించాలి. తరువాత బాణిలిలో చెంచా నెయ్యి వేసి ఎండుమిర్చి వేయాలి. అవి మగ్గాక ఆకుకూరల మిశ్రమం, ఉప్పు వేయాలి. పచ్చివాసన పోయే వరకూ ఉంచి దించేయాలి. ఇప్పుడు ఆవిరి మీద ఉడికిన ఇడ్లీలను ముక్కలుగా చేసి కూరలో వేయాలి. వేరే చట్నీ అవసరం లేకుండా తినేయవచ్చు.