జగత్తంతా శివమయం, అంటే లింగమయమే. బ్రహ్మ౦డమే లింగరూపమైనప్పుడు, సృష్టి స్థితిలయలన్నింటికి లింగమే ఆధారం. సృష్టిలో స్థావరాలు, జంగమాలు కూడా లింగరూపాలే అవుతాయి. వీటిని పూజించడం, సేవిచడం కూడా శివపుజలోకే వస్తుంది. అలాంటి శివపూజ చేసే వారు ఉత్తరముఖంగా కూర్చోవాలని పురోహితులు చెబుతున్నారు. రుద్రాక్ష, భస్మం, మారేడు అనే మూడు వస్తువులు లింగపూజకు తప్పనిసరిగా ఉండాలని శివపురాణం చెబుతోంది.
అలాగే ఏ నెలలో ఏ లింగాన్ని పూజించాలో తెలుసా?
వైశాఖంలో వజ్రలింగాన్ని, జ్యేష్ఠంలో మరకత లింగాన్ని, శ్రావణంలో నీలపు లింగాన్ని, భాద్రపదంలో పద్మరాగ లింగాన్ని, ఆశ్వయుజంలో గోమేధిక లింగాన్ని, కార్తికంలో ప్రవాళ లింగాన్ని, మార్గశిరంలో వైఢూర్య లింగాన్ని, పుష్యమాసంలో పుష్పరాగ లింగాన్ని, మాఘమాసంలో సూర్యకాంత లింగాన్ని పూజిస్తే సత్ఫలితాలు చేకూరుతాయి.
అలాగే ఫాల్గుణ౦లో స్పటిక లింగాన్ని పూజించాలి. వీటికి ప్రత్యామ్నాయంగా వెండి, రాగి లింగాలను కూడా పూజించవచ్చు. లింగపూజ సర్వసుఖాలను ప్రసాదిస్తుంది. ఆర్థికవృద్ధినిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి చేకూరుస్తుందని పండితులు అంటున్నారు.