Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళలు రోజువారీ పనులను క్రమ పద్ధతిలో చేస్తే...?

మహిళలు రోజువారీ పనులను క్రమ పద్ధతిలో చేస్తే...?
, శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (11:43 IST)
సాధారణంగా స్త్రీలను చూసి పెద్దలు చెప్పే మాట.. ఇల్లును చూసి ఇల్లాల్ని చూడాలి అంటారు. ఈ సామెత ఊరికే చెప్పలేదు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటు లక్ష్మీదేవి కొలువై ఉంటారు. వాస్తు ప్రకారం మహిళలు రోజువారీ పనులను క్రమపద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మీ నివాసముంటారు. ముఖ్యంగా మహిళలు ఇలా చేస్తే పేదరికం ఇంటి నుండి పలాయనం చిత్తగించడం ఖాయం.
 
1. సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాకాకుండా, బారెడు పొద్దెక్కిన తరువాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్రలక్ష్మీ వెంటాడుతుంది.
 
2. ఇంటిని శుభ్రం చేసిన తరువాత స్నానం చేయాలి. ఒకవేళ ఆలస్యంగా స్నానం చేస్తే ఇంట్లో పేదరికంతోపాటు శరీర బాధలు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
3. కుటుంబానికి వండిపెట్టడం దేవునికి వంట చేసినట్లే కాబట్టి వంటింట్లోకి ప్రవేశించే ముందు స్నానం చేసిన తర్వాత వంట ప్రారంభించాలి. ముఖ్యంగా స్నానం చేసిన తరువాత దైవ ప్రార్థన చేయాలి. అలా చేసేటప్పుడు నైవేద్యం సమర్పించిన తర్వాతే ఏదైనా స్వీకరించాలి. 
 
4. మహిళలు ఎప్పుడు చూసినా కోపం, చిరాకుతో ఉండే ఇంట్లో సంతోషమే ఉండదు. అందుకే చీటికిమాటికీ చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి. ఇలాంటి కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారడమే కాదు, ఎల్లప్పుడు సుఖసంతోషాలతో వెలిగిపోతుంది.     

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

19-04-2019 శుక్రవారం దినఫలాలు .. ఆర్థిక లావాదేవీలు...