Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటిలో ఈ మార్పులు చేసి చూడండి... మీ ఇంట్లోకి ధన ప్రవాహం ఎవరూ ఆపలేరు...

ఎంత సంపాదించినా ఖర్చైపోతుంటే.. ఈ వాస్తు టిప్స్ పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. జీవితానికి ధనం కూడా అవసరమని, అందుచేత వాస్తు ప్రకారం ఇంటిని ఏర్పాటు చేసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఉంచిన వస్తువులు వాస్తుకు సానుకూలంగా ఆయా దిశలను ఏర్ప

Advertiesment
Vastu tips for Wealth
, గురువారం, 15 సెప్టెంబరు 2016 (11:47 IST)
ఎంత సంపాదించినా ఖర్చైపోతుంటే.. ఈ వాస్తు టిప్స్ పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. జీవితానికి ధనం కూడా అవసరమని, అందుచేత వాస్తు ప్రకారం ఇంటిని ఏర్పాటు చేసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఉంచిన వస్తువులు వాస్తుకు సానుకూలంగా ఆయా దిశలను ఏర్పాటు చేసుకోవాలని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. 
 
ఉత్తరం అంటే కుబేర స్థానం అంటారు. అలాగే ఇంట్లో ఈశాన్య దిశలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకండి. ఈశాన్య దిశలో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఈశాన్యంలో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. ఈ దిశలో చెత్తాచెదారాన్ని ఉంచకూడదు. ఈశాన్య దిశ సిరిసంపదలకు అనుకూలిస్తుంది. 
 
ఇంటిని ఆలయంలా శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తచెదారాన్ని, అనవసర వస్తువుల్ని పారేస్తూ ఉండాలి. ఇంటి ప్రధాన ద్వారానికి నేరుగా ఎలాంటి స్తంభాలు ఉండకుండా చూసుకోవాలి. విద్యుత్ వైర్లతో కూడిన పోల్స్ ఉండకుండా చూసుకోవాలి. ఈశాన్య దిశలో బరువులు ఉంచకండి. నీటి ట్యాంక్‌లు ఉండకుండా చూసుకోండి. మీ ఇంట్లోకి ధన ప్రవాహం ఇక ఎవరూ ఆపలేరు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల శ్రీవారి ఆలయంలో నిద్రపోని చింతచెట్టు...?