Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎలాంటి చెట్లను గృహావరణలో పెంచాలో తెలుసా?

Advertiesment
trees
, గురువారం, 29 నవంబరు 2018 (13:06 IST)
చాలామందికి ఇంటి ఆవరణలో చెట్లు పెంచుకోవాలంటే చాలా ఇష్టంగా భావిస్తారు. కానీ, నేటి తరుణంలో మెుక్కలు పెంచుటకు ఉన్న స్థలాల్లో కూడా ఇంటి కట్టడాలు చేస్తున్నారు. దీని కారణంగానే ఇంటి ఆవరణలో చెట్లు పెంచుటకు ఎవ్వరు అంతగా ఆసక్తి చూపనంటున్నారు. ఇలా జరుగుతూ పోతే ఇక వచ్చే కాలంలో చెట్లు అనే మాట ఉండదు. కాబట్టి వాస్తు ప్రకారం ఈ చిట్కాలు పాటించి గృహావరణలో ఎలాంటి చెట్లు పెంచాలో పరిశీలిద్దాం...
 
1. భయంకర రూపాన్ని కలిగినవి, ముళ్లు కలవి, విష వాయువులు వెదజల్లునవి, ఎర్రని పుష్పాలున్నవి గృహ ప్రాంగణంలో పెంచరాదు. 

2. విశేష వృక్షజాతులు, ఎత్తయిన చెట్లు ఉండరాదు. ముఖ్యంగా తూర్పు, ఉత్తర, ఈశాన్య దిశలలో మహావృక్షాలు దోషాన్ని కలిగిస్తాయి. సాత్విక లక్షణాన్ని పెంచే కొద్ది చెట్లు గృహావరణంలో ఉండడం క్షేమం.

3. తులసి కోటను కట్టుట, అందులో తులసి చెట్టును ప్రతిదినం పూజించుట సర్వదా శ్రేష్టమైనది. గృహం ఆవరణలో తులసి చెట్టును ప్రతిష్టించడం, సర్వోదోషాలు దూరంగా చేసుకోగల్గుటయే. 

4. నిమ్మ, పుష్పజాతులు, పనస, జాజి, మోదుగ, నూరాకుల చెట్టు వంటివి ఇంటి ఆవరణలో పెంచదగ్గవి. గృహావరణంలోనికి గాలిని, సూర్యరశ్మిని ప్రసరించడంలో అడ్డగించేవి ఎంత గొప్ప వృక్షాలైనా నిషేధమే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గురువారం (29-11-2018) దినఫలాలు - లౌక్యంగా వ్యవహరించడం వల్ల...