Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాస్తుకి సంతాన సాఫల్యతకు సంబంధం ఉందా...?

చాలా జంటలు సంతాన లేమితో బాధపడుతుంటాయి. ఇలాంటి వారికి ఇంటిలోని వాస్తు దోషం వల్లే సంతాన భాగ్యం లేదనే సందేహం వారిని వెంటాడుతూ ఉంటుంది. ఇదే విషయంపై వాస్తు నిపుణులను సంప్రదిస్తే.. కింది విధంగా చెపుతున్నారు.

Advertiesment
వాస్తుకి సంతాన సాఫల్యతకు సంబంధం ఉందా...?
, బుధవారం, 16 నవంబరు 2016 (22:22 IST)
చాలా జంటలు సంతాన లేమితో బాధపడుతుంటాయి. ఇలాంటి వారికి ఇంటిలోని వాస్తు దోషం వల్లే సంతాన భాగ్యం లేదనే సందేహం వారిని వెంటాడుతూ ఉంటుంది. ఇదే విషయంపై వాస్తు నిపుణులను సంప్రదిస్తే.. కింది విధంగా చెపుతున్నారు. 
 
"ప్రధానంగా ఈశాన్యం జననానికి, నైరుతి మరణానికి సంకేతాలు" అనేవి వాస్తులో శాస్త్రవేత్తలు చెప్పుకునే సామెతలు. ఈశాన్యంలో లోపం ఉన్నప్పుడు పుత్ర సంతానం లేకపోవడం, ఉన్నా దూరంకావడం జరుగుతుందంటారు. అలాగే ఈశాన్యం మూతపడి ఉండటం ఇంటికి ఈశాన్యం తెగిపడి ఉండటం, నైరుతిలో బావి ఉండటం, ఇలాంటి కారణాలు వంశ అభివృద్ధికి విఘాతాన్ని కలిగిస్తుంటాయి. 
 
అలాంటి గృహంలోని సభ్యులు మంచి వాస్తున్న ఇంటిలోకి వెళితే సంతానం కలుగుతుందా అనే సందేహం కలుగుతుంది. నిజమే సంతానం కలిగే అవకాశం ఉంది. ఐతే, ఈశాన్యలోపం ఉన్న గృహంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారన్న దానిపై వారి ఆరోగ్య క్షీణతలో వచ్చిన మార్పులపై కొత్త ఇంటి ఫలితం ఆలస్యంగా వచ్చే అవకాశముంటుందని చెపుతున్నారు. 
 
ఒక ప్రదేశం మనిషి భావాలను, ఆవేశాలను నియంత్రించినట్టుగా ఈశాన్య, నైరుతి దశలు సక్రమమైనప్పుడు పురుష వీర్యశక్తిని కూడా పునరుద్ధరింపజేస్తాయి. ఇక్కడ ప్రధాన అంశం ఏమిటంటే కొత్త ఇల్లు తూర్పు, ఈశాన్య సింహద్వారమై ఉండవలసిన అవసరముంది. 
 
దక్షిణ, పశ్చిమాలలో ఇండ్లు ఉండి ఈశాన్యం బ్లాక్ అయిన వాస్తు ఇంటిలోకి చేరితే ఆ ఇంటి దిశల డిగ్రీ నూరు శాతం ఉంటే మంచి ఫలితాలు వస్తాయని వారు చెపుతున్నారు. కొత్త ఇంట్లో చిన్న పిల్లల బొమ్మలను పడకగదిలో పెట్టుకుని తూర్పు వైపు తలపెట్టి ఆలుమగలు నిద్రించాలి. ఆత్మ సంకల్పం, దిశ ప్రభావం ద్వారా ఆలస్యంగానైన సంతానం చక్కగా కలుగుతుందని వారు చెపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శిరిడీ సాయి సేవలోనే తరించి 35వ యేటనే లోకయాత్ర ముగించిన భక్తురాలు...