ఇంటి ఆవరణలో బావి ఎక్కడ తవ్వాలి... ఎక్కడ తవ్వకూడదు...?

ఇంటి నిర్మాణంలో బావి తవ్వకం ప్రాధాన్యత వహిస్తోంది. బావి తవ్వకం సరైన దిశలో చేపడితే ఆ ఇంటిలో నివాసముండే వారికి సకల సంపదలు చేరువవుతాయని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. తూర్పు ఈశాన్యంలో బావులు తవ్వుకోవడం వల్ల సకల సంపదలు వనగూరుతాయని వాస్తు నిపుణులు చెపుతున్

బుధవారం, 24 ఆగస్టు 2016 (18:26 IST)
ఇంటి నిర్మాణంలో బావి తవ్వకం ప్రాధాన్యత వహిస్తోంది. బావి తవ్వకం సరైన దిశలో చేపడితే ఆ ఇంటిలో నివాసముండే వారికి సకల సంపదలు చేరువవుతాయని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. తూర్పు ఈశాన్యంలో బావులు తవ్వుకోవడం వల్ల సకల సంపదలు వనగూరుతాయని వాస్తు నిపుణులు చెపుతున్నారు. అయితే కొన్ని దిశల్లో బావి తవ్వకం సరైంది కాదని వాస్తు వెల్లడిస్తోంది.
   
తూర్పు- ఆగ్నేయ భాగంలో బావి తవ్వకూడదని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఈ దిశలలో బావి తవ్వినట్లైతే అనారోగ్యాలు అగ్ని ప్రమాదాలు, ఆర్థిక కష్టనష్టాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇంటి యజమానికి తీవ్ర అనారోగ్య బాధలు కలుగుతాయి. ఉత్తర- వాయువ్య దిశలో బావి తవ్వకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. 
 
ఈ స్థలంలో బావి తవ్వినట్లైతే శత్రుహాని, అనారోగ్యాలు ముఖ్యంగా స్త్రీలకు సుఖశాంతులు కరువవుతాయి. మానసిక సంక్షోభం వంటి చెడుఫలితాలు కలుగుతాయని వాస్తునిపుణులు అంటున్నారు. 
 
పడమర భాగంలోను, పడమర-వాయవ్య, నైరుతి-పడమర దిశలలో బావితవ్వకూడదని వాస్తు తెలుపుతోంది. అలా బావి తవ్వకం చేపట్టినట్లైతే... ఆ గృహంలో నివసించువారికి అనారోగ్యాలు, ఆర్థిక కష్టనష్టాలు కలిగి చెడుస్నేహాలు, గౌరవ భంగం కలుగుతుందని వాస్తునిపుణులు తెలుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కృష్ణుడి తలపైకి నెమలి పింఛం ఎలా వచ్చింది...?