మీ ఆఫీసును వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోండి. వాస్తు టిప్స్‌ను అనుసరించి కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటే సానుకూల ఫలితాలుంటాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా ధనానికి ప్రాధాన్యత ఇవ్వండి. అందుకే అలమరాలు, లాకర్లు ఉత్తరం వైపు ఏర్పాటు చేసుకోండి. అయితే దక్షిణం వైపు మాత్రం ధనం వుంటే లాకర్స్ ఏర్పాటు చేయకండి.
దక్షిణం వైపు ఎలాంటి గ్రౌండ్ ట్యాంక్‌లు ఉండకుండా చూసుకోండి. ఒక వేళ దక్షిణం వైపు గ్రౌండ్ ట్యాంక్‌లు ఉంటే ఆర్థిక పరమైన చిక్కులు తప్పవు. దేవుడు పటాలు, అద్దాలు మీకు అనుకూలించే దిశలో ఏర్పాటు చేసుకోండి. ఇక వాటర్ ప్లోయింగ్ ఉత్తరం నుంచి తూర్పు వైపు దిశలో వెళ్లేలా చూసుకోవడం మంచిది. వాటర్ ఫౌంటైన్ ఈశాన్య మూలలో ఏర్పాటు చేసుకోండి. అక్వేరియంలో 9 గోల్డ్ ఫిష్, ఒక బ్లాక్ ఫిష్‌లను ఉంచి ఈశాన్య దిశలో ఏర్పాటు చేసుకోండి. ఇది గృహాలకు కూడా వర్తిస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు.