Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వంటగదిలో మందులొద్దు.. పడకగదిలో అద్దాలు వద్దే వద్దు.. నేమ్ ప్లేటుతో మేలెంత?

ఇంట్లో మూడేళ్లకు ఒకసారి గణేశ పూజ లేదా నవగ్రహ పూజ చేయించడం ద్వారా ఆ గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యపరంగా సమస్యలుండవు. ఆర్థిక పరమైన ఇబ్బందులు వుండవని వాస్తు నిపుణులు సూచ

వంటగదిలో మందులొద్దు.. పడకగదిలో అద్దాలు వద్దే వద్దు.. నేమ్ ప్లేటుతో మేలెంత?
, గురువారం, 27 జులై 2017 (15:57 IST)
ఇంట్లో మూడేళ్లకు ఒకసారి గణేశ పూజ లేదా నవగ్రహ పూజ చేయించడం ద్వారా ఆ గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యపరంగా సమస్యలుండవు. ఆర్థిక పరమైన ఇబ్బందులు వుండవని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా వాస్తు దోషాలేవైనా ఉంటే.. గణేశ, నవగ్రహ పూజలను చేయించడం ద్వారా తొలగిపోతాయి.

అలాగే ఇంట వాస్తు దోషాలు తొలగాలంటే శుక్రవారం పూట ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తు గల రంగవల్లికలు వేయించాలి. రంగోలీలు వేసేటప్పుడు స్వస్తిక్ గుర్తు వేసి.. ఎవరూ తొక్కనీయకుండా జాగ్రత్తపడాలి. ఇలా చేస్తే ఆ ఇంట వున్నవారు అనారోగ్యాల బారినపడరని వాస్తు నిపుణులు చెప్తున్నారు. 
 
కానీ ఇంట్లో యుద్ధ, కోప సంబంధింత ఫోటోలను తగిలించకూడదు. గరుడ దేవుడు వుండే ఫోటోలను ఇంట్లో వుంచకూడదు. అలాగే ఓ బౌల్‌‍లో రాతి ఉప్పును వుంచి ఇంటికి నాలుగు మూలల్లో వుంచడం ద్వారా నెగటివ్ ఎనర్జీని పారద్రోలవచ్చు. పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి రప్పించాలంటే.. టింక్లిన్ బెల్స్ ఉపయోగించాలి. అలాగే ఇంటికి మూలల్లో గంగాజలం వంటి పుణ్యతీర్థాలను వుంచి వారానికి ఓసారి మార్చి వేస్తుంటే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. 
 
ముఖ్యంగా పడకగదిలో అద్దాలుండకుండా చూసుకోండి. ఒకవేళ డ్రెస్సింగ్ టేబుల్, కబోర్డులకు అద్దాలుంటే వాటికి కర్టెన్లు వేయడం మంచిది. ఇలా చేస్తే కుటుంబకలహాలు, దంపతుల మధ్య మనస్పర్ధలు ఏర్పడవని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇక మానసికంగా కుంగిపోవడాన్ని దూరం చేసుకోండి, రోజు 15-20 నిమిషాల పాటు ధ్యానం చేయండి. అలా చేస్తే మనస్సుకు ఆహ్లాదం కలుగుతుంది. సమస్యలను సునాయాసంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. 
 
వాస్తు ప్రకారం మందులను వంటగదికి పక్కనే ఉంచకండి. అలాగే వంటగదిలో మందులు కనబడకూడదు. ఒకవేళ వంటగదిలో మందులుంటే.. ఆ ఇంట వున్నవారికి అనారోగ్య సమస్యలు తరచూ వేధిస్తుంటాయి. వంటగది ఆరోగ్యానికి సానుకూలమైతే.. మందులు ప్రతికూలమని గ్రహించాలి. ఇక ఓ గ్లాసుడు నీటిలో నిమ్మకాయను కట్ చేసి వేసి.. ఆ నీటిని ప్రతి శనివారం మారుస్తూ వుంటే.. ఇంట్లో ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుంది. 
webdunia
 
అలాగే ఇంట్లో రోజూ ధూపదీపాలు వెలిగించండి. ఉదయం సాయంత్రం పూట అగరవత్తులను వెలిగించండి. ఇంటిని శుభ్రంగా వుంచుకోవడం ద్వారా వాస్తు దోషాలు చాలామటుకు దూరమవుతాయి. ఇంటికి బయట నేమ్ ప్లేట్ తగిలించడం కూడా ఇంటి యజమానికి మేలు చేస్తుంది. ఆ ఇల్లు అతనికే సొంతమనే భావన కలిగించడంతో పాటు ఇంటి ఓనర్‌కు పాజిటివ్ ఫలితాలు చేకూర్చేలా చేస్తుంది. మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెప్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి భక్తులు వచ్చే నెల 7న తిరుమల రావద్దండి... ఎందుకు?