Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గృహ నిర్మాణాన్నిఅర్ధాంతరంగా ఆపడం శ్రేయస్కరమా?

గృహ నిర్మాణాన్నిఅర్ధాంతరంగా ఆపడం శ్రేయస్కరమా?
, మంగళవారం, 1 జులై 2014 (17:35 IST)
కొత్త ఇల్లు నిర్మాణంలో ఉన్నప్పుడు కొన్ని పనులను ఆర్థిక ఇబ్బందుల వల్ల నిర్మాణ పనులు ఆపేయాల్సి వస్తుంది. మరికొన్నింటిని తప్పకుండా చేయాలి. అయితే కొంతమందికి వేటిని వాయిదా వేయాలో వేటిని వాయిదా వేయకూడదో తెలియకపోవటంతో వారికి తోచిన పనులను పెండింగ్‌ పెడుతుంటారు. 
 
ఇలా చేయటం వాస్తూ రీత్యా అనేక దోషాలకు కారణమవుతుంది. అందువల్ల ఇల్లు నిర్మించేటపుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల  ఇంటి పనులను ఆపవలసి వస్తే ప్రత్యేకించి కొన్నింటిని మాత్రమే వాయిదావేయాలి. మిగిలినవి  తప్పకుండా పూర్తి చేయవలసి ఉంటుంది.
 
అవేమిటో ఒకసారి పరిశీలిద్దాం....
 
ఇల్లు కట్టేటప్పుడు ఇంటి లోపల ఫ్లోరింగ్‌లు ఆపవచ్చు కానీ ఆర్డినరీ గచ్చు వాటాన్ని వాస్తూ రీత్యా వేయాలి. అంతేకాదు ఇంటి లోపల లో లెవల్‌ పెట్టకూడదు. లోపల గదులకు ద్వారాలు, కిటికీలు, కప్‌ బోర్డులు, షో కేసులు తదితర వాటికి సంబంధించిన చెక్కపని ఆపవచ్చు. ఇంటిలోపల టాయ్‌లెట్‌ కోసం గది నిర్మించినప్పటికీ లోపల పనిముట్లు పెట్టకుండా వాయిదా వేయవచ్చు. ఇంటి ఫ్లోరింగ్‌కు సంబంధించి అన్ని గదుల్లోనూ టైల్స్‌ పని ఆపవచ్చు.  
 
ఇంటికి గచ్చు వేయించే దాకా మట్టి కొట్టుకుపోకుండా జాగ్రత్త పడాలి. పూజ గది కట్టిన తర్వాత దానిలోని అలంకరణకు సంబంధించిన పని... అంటే టైల్సు వేయటం వంటి మొదలైన పనులను వాయిదా వేసుకోవచ్చు. గ్రిల్‌కు సంబంధించిన డిజైన్లు, కాంపౌండ్‌ గేట్లు ఆపుచేసుకోవచ్చు. అదేవిధంగా మెట్లు కట్టకుండా వాయిదా వేసుకోవచ్చు. కిటకీలకు గుమ్మాలకు రంగులు వేయటం నిలుపుకోవచ్చు. 
 
ఇంటికి సంబంధించిన కాంపౌండ్‌ వాల్‌ను ఆపచ్చు కానీ గోడ కట్టు మాత్రం సరిగ్గా ఉండేటట్లు చూసుకోవాలి. పెద్ద ఇంటికి ప్లాను వేయించి అందులో కొంత ఇప్పుడు కట్టి భవిష్యత్తులో మిగిలిన దానిని కట్టుకోవచ్చు. శ్లాబు వాస్తురీత్యా వాటం సరిగా లేనప్పుడు శ్లాబుపై ప్లాస్టరింగ్‌లు, ఫినిషింగ్‌లు తప్పనిసరిగా చేయించాలి. ఇంటిలోపల ఉన్న టాయిలెట్లు వాడకంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా తలుపులు ఉండాలి. అదేవిధంగా గృహ ఆవరణలో మట్టి నింపే పని ఉన్నపుడు దానిని అసంపూర్ణంగా వదిపెట్టకూడదు. 
 
మేడ మీద, మెట్ల మీద పిట్ట గోడలు కట్టకుండా ఆపకూడదు. బయట ద్వారాలకు తలుపులు పెట్టకుండా ఆపనే కూడదు. గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత గృహప్రవేశం చేయకుండా ఉండకూడదు. గృహనిర్మాణం పూర్తయిన తర్వాత గృహ ఆవరణలో ఆగ్నేయ, నైరుతీ,పశ్చిమ, వాయవ్య దిశలలో పెద్ద వృక్షాలను పూర్తిగా తొలగించకూడదు. 

Share this Story:

Follow Webdunia telugu