ఇంటి నిర్మాణంలో దిక్కులు ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా, తూర్పు, ఉత్తరాల కంటే పశ్చిమ స్థలం ఎత్తుగా ఉండటం సర్వదా శుభదాయకం. పురుషులకు విద్యా, జ్ఞానములు, మానసిక బలం చేకూరును. పశ్చిమ దిశవైపు ఇతర కట్టడములుంటే మంచిది. తూర్పు ఉత్తరాల కన్నా పశ్చిమ స్థలం ఎక్కువ ఖాళీగా వున్నా కూడా అశుభ ఫలితాలు కలుగుతాయని వాస్తు చెబుతోంది.
పశ్చిమ దిశలో ఎత్తైన చెత్తకుండీలున్న శుభములు కలుగుతుందని వాస్తు నిపుణులు చెపుతున్నారు. అయితే, పశ్చిమ భాగంలో మరుగుదొడ్డి నిర్మించకూడదు. పశ్చిమ భాగంలో ఎత్తుగా నీళ్ళకుండీలు, డ్రమ్ములు వుంచవచ్చు. పశ్చిమ భాగంలో బావి ప్రమాదకరమని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్థలంలో వాడుకనీరు పశ్చిమ భాగము నుండి పారుట అశుభమని, పశ్చిమ భాగంలోని ద్వారము నైరుతికి అభిముఖముగా నున్నచో అనేక అరిష్టములు కలుగుతాయి. పశ్చిమ ద్వారము వాయువ్యమునకు అభిముఖముగా నున్నచో భయంకరమైన రోగాలు కలుగుతాయి.
పశ్చిమ దిశలో మేడమెట్లు నిర్మించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి. పశ్చిమ సరిహద్దును ఆనుకుని అంతస్తులు నిర్మించిన విశేష ధనాదాయము, సుఖ-సంతోషాలు కలుగుతాయి. పశ్చిమ దిశలో వరండా వుంచి గృహ నిర్మాణము చేస్తే లేని పోని సమస్యలు వచ్చి తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి.
పశ్చిమ స్థలములో వాహనాలను పార్కింగ్ చేయుట శుభకరము. పశ్చిమ భాగములో ఇంటికంటే ఎక్కువ మెట్లు వుంటే శుభాలు కలుగుతాయి. పశ్చిమ వీధి కన్నా గృహాల ప్లోరింగ్ తక్కువ వుంటే శుభదాయకమని వాస్తు శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు.