Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒక ఇంటిని ముగ్గురు వ్యక్తులు పంచుకోకూడదా?

ఒక ఇంటిని ముగ్గురు వ్యక్తులు పంచుకోకూడదా?
, మంగళవారం, 17 జూన్ 2014 (17:27 IST)
ఇంటికి ఎదురుగా దిగుడు బావి వుంటే ఆ ఇంటి వారికి జ్వరాలు వంటి వ్యాధులు తప్పవు. కుమ్మరిసానె ఇంటి ఎదురుగా ఉంటే హృద్రోగ వ్యాధులు తప్పవని వాస్తు నిపుణులు అంటున్నారు.
 
గృహానికి నేరుగా నీటి వనరులు, పాలకొట్టు ఉన్నట్లైతే వ్యాధులు తప్పవు. ఇంటికి ఎదురుగా రైస్ మిల్స్ ఉంటే ధనహాని కలుగుతుంది. అలాగే ఇంటికి నేరుగా వాటర్ పెన్సింగ్‌లున్నట్లైతే శత్రుబాధ తప్పదు. 
 
ఇంటి ప్రధాన ద్వారానికి నేరుగా వృక్షాలు వుండకూడదు. చెట్లనీడ సింహద్వారముపై పడినట్లైతే భాగ్యము తరిగిపోగలదు. కిటికీలు లేని గృహంలో నివాసం కూడదు. అది నిరంతర రోగప్రదము. 
 
ఇక ఇంటికి మూడు ద్వారములుండుట దోషము. అనగా సింహ ద్వారముగాక ముఖభాగమునందు రెండు ద్వారములుండకూడదు. ఒక ఇంటిని మూడు భాగాలుగా విభజించుటగానీ, ముగ్గురు వ్యక్తులు పంచుకొనుటగాని దోషము. శివాలయమునకు, గ్రామదేవతలకు ఎదురుగా గృహనిర్మాణమును జేయరాదు. 

Share this Story:

Follow Webdunia telugu