Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలాంటి మొక్కలను ఇంట్లో పెంచకూడదట!

Advertiesment
Rubber plants
, గురువారం, 19 జూన్ 2014 (16:21 IST)
మీ పిల్లల కోసం ఏర్పాటు చేసే డ్రాయింగ్ రూమ్ ఏ దిశలో ఉండాలంటే.. డ్రాయింగ్ రూమ్స్‌కు తూర్పు, ఉత్తర దిశలు ఉత్తమమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. 
 
అలాగే లివింగ్ రూమ్ ఇంటి ద్వారాలు దక్షిణ, నైరుతి, పశ్చిమ దిశల్లో ఉండాలి. బ్రహ్మ స్థానాన్ని ఎప్పుడూ వెలుతురుగా శుభ్రంగా ఉంచాలి. ఇందుకు ఉత్తరం, ఈశాన్యం, తూర్పు దిశల్లో ఎప్పుడూ వెలుతురు ఉండేలా చూసుకోవాలి. దక్షిణం, పశ్చిమ, సౌత్ వెస్ట్ దిశల్లో బరువు వుంచవచ్చు. 
 
ఇకపోతే.. రబ్బరు మొక్కలు, పాలు కారే మొక్కలను ఇంట్లో ఉంచకండి. వీటిని ఇంట్లో పెంచితే అనారోగ్య సమస్యలతో పాటు మానసిక ప్రశాంత ఏర్పడుతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
అలాగే పనిచేయని వస్తువులు.. పగిలిన గడియారాలు, టెలిఫోన్, రేడియో, మిక్సర్ వంటివి ఇంట్లో ఉంటే వాటిని వెంటనే తొలగించండి. ఇవి ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu