Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపావళి రోజున వాస్తు ప్రకారం లక్ష్మీదేవి పటాన్ని..?

Advertiesment
Diwali vastu tips for home
, మంగళవారం, 21 అక్టోబరు 2014 (16:43 IST)
వాస్తు ప్రకారం దీపావళి రోజున లక్ష్మీదేవి పటాన్ని లేదా ప్రతిమను.. అలాగే విఘ్నేశ్వరుడు, ఇంద్ర, కుబేరుడిని పూజించేందుకు ఈశాన్య లేదా ఉత్తర లేదా తూర్పు దిశవైపుగా ముఖాలు ఉండేలా ప్రతిష్టింపజేసుకోవాలి. ఇలా చేస్తే ఆ ఇంటి యందు అష్టైశ్వర్యాలు సకల సంపదలు చేకూరుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. 
 
వాస్తు ప్రకారం దీపావళి ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకుని పాతబడిన, పనికిరాని వస్తువులను ఇంటి నుంచి పారేయడం ద్వారా కొత్త శక్తిని ఆహ్వానింపజేసుకోవచ్చు.
 
దీపావళి రోజున ఇంటిని అలంకరించుకోవడం ద్వారా ఆ మహాలక్ష్మీ దేవిని ఆహ్వానించినట్లవుతుంది. శుచిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చి.. మామిడి ఆకుల తోరణాలు, బంతిపూల ఆహారాలు ఇంట్లో తాజా పువ్వులతో అలకరించుకోవడం ఇంటి నిండా దీపాలతో లక్ష్మీదేవికి ఆహ్వానం పలకండి. 
 
ఉత్తరం దిశలో కుబేర స్థానం సంపదకు చిహ్నంగా భావిస్తారు. ఈ ప్రదేశంలో లాకర్ లేదా అల్మారాను అమర్చుకుంటారు. అలాగే అమర్చిన లాకర్‌లో లక్ష్మీదేవిని ప్రతిమను ఉంచుకుని దీపావళి రోజున పూజలు చేస్తే సకల శుభాలు, ఆయురారోగ్యాలు, సంపదలు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu