కర్పూరం చాలా స్వచ్ఛమైనది. ఇది మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా చాలా ప్రశాంతంగా చేస్తుంది. అందుకే పూజ చేసేటప్పుడు అందరూ కర్పూరం వెలిగిస్తారు. అదేవిధంగా, బిర్యానీ ఆకును కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ రెండింటినీ కలిపి వెలిగించడం వల్ల వాస్తు ప్రకారం మనకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి.
చాలా మంది ఇంట్లో ఎవరితోనైనా నిరంతరం గొడవ పడుతూనే ఉంటారు. ఆ గొడవ వల్ల ఇంట్లో మనశ్శాంతి ఉండదు. కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ.. ఈ కర్పూరంతో బిర్యానీ ఆకును కాల్చడం వల్ల.. ఆ సమస్యలు తలెత్తవు. ఇంట్లో ఏవైనా సమస్యలుంటే తగ్గుతాయి. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. దంపతుల మధ్య సమస్యలు ఉన్నా, అవి పరిష్కారమవుతాయి. ఏదైనా నరదృష్టి దృష్టి ఉన్నా, అది కూడా తొలగిపోతుంది. కాబట్టి, ఈ పద్ధతిని ఖచ్చితంగా పాటించాలని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు.
అలాగే కొంతమంది ఎంత కష్టపడి పనిచేసినా, వారి దగ్గర ఎప్పుడూ తగినంత డబ్బు ఉండదు. మీరు ఇలా బాధపడుతుంటే, శనివారం రాత్రి బిర్యానీ ఆకును కర్పూరంతో కలిపి కాల్చాలి. ఇలా చేయడం వల్ల మీ చేతిలో ఎప్పుడూ డబ్బు ఉంటుంది. డబ్బుకు కొరత ఉండదు.
శనివారం రాత్రి ఇంట్లో, కర్పూరంలో ఒక బిర్యానీ ఆకు వేసి కాల్చండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోతుంది. అంతే కాకుండా, ఇంట్లో సానుకూల శక్తి కూడా పెరుగుతుంది. శనివారం రాత్రి, కర్పూరంలో ఒక బిర్యానీ ఆకు వేసి కాల్చడం ద్వారా, మన జీవితంలోని అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు.
శనివారం రాత్రి కర్పూరంలో తులసి ఆకులను కాల్చడం వల్ల ఆర్థిక విషయాలలో ఏవైనా అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారంలో ఏవైనా అడ్డంకులు ఉంటే, అవి తొలగిపోతాయి. అలా కాకుండా, ఎవరైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే, ఈ కర్పూరంతో పాటు ఒక బిర్యానీ ఆకును కాల్చాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.