"వాలెంటైన్ డే"నా... అదంతా ట్రాష్ : అక్ష
, శనివారం, 11 ఫిబ్రవరి 2012 (17:55 IST)
వాలెంటైన్ డే అనేది ప్రేమికులు జరుపుకునే రోజు.. ఇది మన కల్చర్ కాదు. కానీ ఇప్పటి ప్రేమికులంతా అదేదో గొప్ప కార్యక్రమంలా ఫీలవుతున్నారు. ఇదంతా ట్రాష్.. అంటూ నటి అక్ష పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వచ్చిన ఆమె... ప్రేమికుల రోజుపై గట్టిగానే మాట్లాడారు. ప్రేమ అనేది ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదని అలాంటి వాటిపై తనకు అసలు నమ్మకం లేదని చెప్పింది. తన ఫస్ట్ క్రష్ రణబీర్‌కపూర్‌తోనే అన్న ఆమె.. ఆరో తరగతిలో ఉండగానే ఇది జరిగిందనీ.. ఆ వయస్సులో ప్రేమకు తావెక్కడ అని ఎదురు ప్రశ్నించింది. షూటింగ్ ముచ్చట్లు చెబుతూ... ఉదయమే అల్పాహారం తిని షూటింగ్‌కు వెళతానంది. లేకపోతే మూడాఫ్ అవుతుందని చెప్పింది.