Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమికుల కోసమే ఈ నెల... ఎంజాయ్!!

ప్రేమికుల కోసమే ఈ నెల... ఎంజాయ్!!

Gulzar Ghouse

FILE
దేశంలోనే కాక ప్రపంచంలోని ప్రజలందరికీ ప్రతి నెల, రోజు ముఖ్యమైనవే. ఇందులో ప్రేమికులకు కూడా ఓ నెలంటూ ఉంది. అదేంటంటే ఫిబ్రవరి నెల. ఈ నెలలో ప్రకృతిపరంగా వాతావరణం ఆహ్లాదంగాను, వసంత రుతువులో వికసించిన పుష్పాలు, వాటి సువాసనలు మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి.

ఫాల్గుణ మాసంలో మనసును మత్తెక్కించే వాతావరణంతో నిండి ఉంటుంది. ఆంగ్లమాసం ప్రకారం ఫిబ్రవరి నెలలో ప్రకృతి అందాలు మరింత రెట్టింపవుతాయి. ఈ నెలలోనే ప్రేమకు సంబంధించిన అంశాలు మనసులో మెదులుతాయంటున్నారు పరిశోధకులు. ఈ నెలలోనే ప్రేమికులకు అరుదైన రోజు, అనువైన రోజు వాలెంటైన్ డే. వాలెంటైన్ డే ఎంతో దూరంలో లేదు. కాబట్టి ఫిబ్రవరి నెల మొత్తం ప్రేమికులకు అనుకూలమైన నెల.
webdunia
FILE


* ఫిబ్రవరి 7న గులాబీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఫిబ్రవరి 8న ప్రపోజ్ చేయడం. అంటే మీరు ప్రేమించే వ్యక్తులకు మీ ప్రేమ గురించి వ్యక్తపరచడం చేయాలి.

* ఫిబ్రవరి 9న చాకొలేట్ దినోత్సవంగా జరుపుకోవాలి. అంటే ఆ రోజున మీరు అభిమానించి, ఆరాధించే వ్యక్తికి ప్రేమతో చాకొలేట్ ఇచ్చి వారి నోరు తీపి చేయాలి. ఫిబ్రవరి 10న టెడ్డీ డే గా జరుపుకోవాలి. అంటే ఈ రోజున టెడ్డీ టాయ్స్‌లాంటివి బహుమానంగా ఇచ్చి మీ ప్రేమను వ్యక్త పరచాలి. ఫిబ్రవరి 11న నిజమైన ప్రేమికులైన ప్రామిస్ డే గా జరుపుకోవాలి. అంటే ఆ రోజున ఒకరినొకరు తమ ప్రేమను ఎల్లవేళలా కాపాడుకుంటామని, ఒకరిని విడిచి మరొకరు ఉండలేమన్నట్లు ఒట్టు వేసుకోవాలి.

webdunia
FILE
* ఫిబ్రవరి 12న కిస్ డే( ముద్దుల రోజు) ఈ రోజున నిజమైన ప్రేమికులు తమ ప్రేమికులకు ఏదైనా వస్తువును బహుకరిస్తూ ముద్దాడాలి. ఫిబ్రవరి 13న కౌగిలింతల రోజు. అంటే " హగ్ డే ". ఈ రోజు ప్రేమికులిరువురు ఒకరినొకరు కౌగిలించుకోవాలి. ఫిబ్రవరి 14న జగమెరిగిన రోజు. అదేనండి "వాలెంటైన్స్ డే". ప్రేమించే వారికి ఈ రోజు చాలా అరుదైన రోజు. అత్యంత ఇష్టమైన రోజు. అతి ముఖ్యమైన రోజు. ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు.

ప్రేమికులు ప్రేమ మాధుర్యాన్ని ఆస్వాదించిన తర్వాత మరుసటి రోజు ఫిబ్రవరి 15న మీ ప్రియుడు/ ప్రియురాలితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఈ రోజును స్లాప్ డేగా జరుపుకుంటారు. అంటే ఎవరైనా మీ బుగ్గపై సుతిమెత్తగా కొట్టే అవకాశం ఉంది. కాబట్టి మీరు కోరుకునే వారిని సుతిమెత్తగా వారి బుగ్గపై కొట్టండి.
webdunia
FILE


ఫిబ్రవరి 16న కిక్ డే గా జరుపుకుంటారు. కాబట్టి ఈ రోజున కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఈ రోజున మీరు ఎవరినైనా కిక్ చేయవచ్చు. అంటే ఎవరినైనా ప్రేమగా కొట్టవచ్చు. అదే ఫిబ్రవరి 17న పర్ఫ్యూమ్ డే. ఆ రోజున మంచి పర్ఫ్యూమ్‌ను మీరు స్ప్రే చేసుకుని మీకు నచ్చిన వారి మనసును ఆకట్టుకోండి. ఇదే రోజున మీరు మెచ్చిన, నచ్చిన వారికి పర్ఫ్యూమ్‌ను బహుకరించవచ్చు.

webdunia
FILE
ఫిబ్రవరి 18న ఫ్లిర్టింగ్ డే. ఈ రోజున మీరు మీ ప్రేమికులతో ఆటలాడుకోవాలన్నమాట. ఫిబ్రవరి 19న కన్ఫెషన్ డే. అంటే మీ ప్రియుడు/ప్రియురాలి తప్పును అంగీకరించడమన్నమాట. మీ ద్వారా తప్పు జరిగితే దానికి మీరు ఒప్పుకోవడం.

ఫిబ్రవరి 20న మిస్సింగ్ డే. ప్రేమికులు ఆ రోజున తమ తోటి ప్రియుడు/ప్రియురాలు ఏకాంతంగా ఉంటూ ఒంటరి తనాన్ని అనుభవించే రోజు. అదే ఫిబ్రవరి 21న బ్రేకప్ డే. ఆ రోజున మీ ప్రేమ పాఠం పూర్తయ్యిందన్నమాట. ఒకవేళ మీకు మీ ప్రియుడు/ప్రియురాలిపట్ల అనురాగం, ప్రేమ లేదా వారి వ్యవహారం నచ్చకపోతే మీ ప్రేమను తుంచేసుకోవచ్చన్నమాట. దీనినే బ్రేకప్ డే గా వ్యవహరిస్తారు. కాబట్టి ఈ పదిహేను రోజుల ప్రేమ కొరకు సిద్ధం కావాలనుకుంటే ప్రేమించడం ప్రారంభించండి.

ఏయే రోజు ఏమేం చేయాలి :
webdunia
FILE


8 ఫిబ్రవరి : ప్రపోజ్ డే
9 ఫ్రిబ్రవరి : చాకొలేట్ డే
10 ఫిబ్రవరి : టేడ్డీ డే
11 ఫిబ్రవరి : ప్రామిస్ డే
12 ఫిబ్రవరి : కిస్ డే
13 ఫిబ్రవరి : హగ్ డే
14 ఫిబ్రవరి : వాలెంటైన్ డే
15 ఫిబ్రవరి : స్లాప్ డే
16 ఫిబ్రవరి : కిక్ డే
17 ఫిబ్రవరి : పర్ఫ్యూమ్ డే
18 ఫిబ్రవరి : ఫ్లర్టింగ్ డే
19 ఫిబ్రవరి : కన్ఫేషన్ డే
20 ఫిబ్రవరి : మిస్సింగ్ డే
21 ఫిబ్రవరి : బ్రేకప్ డే

Share this Story:

Follow Webdunia telugu