ప్రేమను వెల్లడించేందుకు ఒక రోజు కావాలా..?: తాప్సీ ప్రశ్న
, మంగళవారం, 14 ఫిబ్రవరి 2012 (17:33 IST)
నేను నిజమే చెబుతున్నా.... నాకు వాలెంటైన్స్ డే అంటే అస్సలు పడదు. ఇప్పుడే కాదు. కాలేజీ రోజుల నుంచీ అంతే.. ఇదో మార్కెటింగ్ జిమ్మిక్ అని నా అభిప్రాయం... అంటూ నటి తాప్సీ చెబుతోంది. ప్రేమికుల రోజున హైదరాబాద్‌లో ఓ షోరూమ్ ప్రారంభోత్సవానికి వచ్చింది. ఈ సందర్భంగా పలు విషయాలు తెలియజేసింది. నా ఉద్దేశంలో ఇది ఓ మార్కెటింగ్ జిమ్మిక్.. అంటోంది. మీరింత వరకు ప్రేమికుల రోజును జరుపుకోలేదా? అన్న ప్రశ్నకు.. ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఓరోజు ఏమిటి? అంటూ నిర్మొహమాటంగా చెప్పింది.ప్రేమంటే ద్వేషమా? అని అడిగితే... ప్రేమ అంటే నాకు ద్వేషం లేదు. కానీ నేను ఎవరితోనూ ప్రేమలో పడను అని చెప్పగలను. కొత్త చిత్రాలను గురించి చెబుతూ... గుండెల్లో గోదారి షూటింగ్ పూర్తయింది. హిందీలో చేస్తున్న చాష్మే బద్దూర్ షూటింగ్ జరుగుతుంది. దరువు కూడా జరుగుతుంది. షాడో మార్చిలో ఉంటుంది అని చెప్పింది.