వాలెంటైన్ డే స్పెషల్ ఐ ఫోన్ 6... ధర రూ. 7.6 లక్షల నుంచి రూ. 15 కోట్లు

గురువారం, 12 ఫిబ్రవరి 2015 (17:01 IST)
ఈ వాలెంటైన్ డే నాడు ప్రేయసికి అత్యంత ఖరీదైన ఫోనును గిఫ్ట్ గా ఇచ్చేందుకు ఇప్పటికే ప్రేమికులు సిద్ధమైపోయి ఉంటారనుకోండి. ఐతే తమ ప్రేయసికి అత్యంత ఖరీదైన ఫోనను బహుమతిగా ఇవ్వాలంటే ఐ ఫోన్ కంపెనీ వారు అందుకు సిద్ధంగా ఉన్నారు. వజ్రాలు పొదిగిన బంగారపు ఫోనును ఆర్డర్ చేస్తే తయారు చేసి ఇచ్చేస్తారు. దీనికి సంబంధించిన వివరాలను ఐ ఫోన్ కంపెనీ ప్రకటించింది.

 
మోడల్ ఐ ఫోన్ 6 డైమండ్ ఫోనుతో ఈ వాలెంటైన్ డే సెలబ్రేట్ చేసుకోండంటూ చెపుతోంది. ఈ ఫోను ధర రూ. 7.6 లక్షల నుంచి రూ. 15 కోట్ల వరకూ ఉంటుందట. ఫోను మొత్తం బంగారు తాపడంతో ధగధగలాడిపోతుంది. కస్టమర్లు డిమాండ్ చేసిన మేరకు, వారి బడ్జెట్ అనుసరించి ఫోనుకు వజ్రాలను పొదగడం జరుగుతుందని కంపెనీ తెలియజేస్తోంది. 
 
24 కేరట్ల బంగారంతో పసుపు, పింక్, ప్లాటినమ్ వర్ణాలలో ఈ ఫోనును తయారు చేసినట్లు చెప్పారు. ప్రతి మోడల్ కూడా ముందస్తు ఆర్డర్ అనుసరించి మాత్రమే తయారు చేస్తామని వెల్లడించారు. తమకు ఎంట్రీ లెవల్లోనే 5 ఆర్డర్లు వచ్చాయని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి