Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాలెంటైన్ డే స్పెషల్ : ముఖేష్ అంబానీ, నీతా అంబానీల లవ్ స్టోరీనే హాట్ టాపిక్!

Advertiesment
Mukesh Ambani
, శనివారం, 13 ఫిబ్రవరి 2016 (17:13 IST)
ప్రేమికుల రోజున పురస్కరించుకుని ప్రేమ జంటలు తమ ప్రేమను గుర్తు చేసుకోవడం లేదా తమ ప్రేమకు నాంది పలకడం వంటివి చేస్తుంటాయి. ఈ తరహాలో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఒక్కటైన ప్రేమ జంటలు ప్రేమికుల రోజున తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వాలెంటైన్ డే సెలెబ్రేషన్స్‌కప రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల లవ్ స్టోరీ హాట్ టాపిక్‌గా మారింది. 
 
ముఖేష్, నీతా అంబానీల జోడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ వ్యాపార విపణిలో పారిశ్రామికవేత్తగా ఎదిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు, దివంగత ధీరూభాయి అంబానీ.. పెళ్లి విషయంలో తన పెద్ద కొడుకు ముఖేశ్‌ను కానీ, చిన్న కుమారుడు అనిల్ అంబానీని కానీ ఎప్పుడూ ఒత్తిడికి గురి చేయలేదు. ముఖేశ్ అంబానీ, నీతాల ప్రేమ పెళ్ళికి అంగీకరించారు. ఈ నేపథ్యంలో ముఖేశ్ అంబానీ లవ్ ప్రపోజల్‌ను నీతా ఎలా అంగీకరించారనే దానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. 
 
ఇరు కుటుంబాల అంగీకారంతో ప్రేమ, డేటింగ్ అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట ఓ ఆసక్తికర ఘటన తర్వాత పెళ్ళి చేసుకుంది. చదువు పూర్తయ్యేంతవరకు పెళ్ళిమాట ఎత్తకూడదని నీతా చెప్పడంతో.. అంబానీ ఆమెను ఎలాగైనా పెళ్ళికి ఒప్పించాలని డిసైడ్ అయ్యారట. అంతే రైడింగ్‌కు వెళ్తూ ముంబైలోని పోద్దార్ రోడ్డు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడితే, ముఖేశ్ కారు ఆపారు.
 
సరిగ్గా గ్రీన్ లైట్ పడుతుందనగా... ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అంటూ నీతాకు ప్రపోజ్ చేశారట. నీతా స్పందించేలోగా గ్రీన్ లైట్ వెలగడం.. వెనకున్న కారు హారన్లు మోగడంతో ఏమీ చేయలేకపోయిన నీతా.. ముందు కారు తీయమని చెప్పిందట. ఇందుకు అనిల్ అంబానీ ససేమిరా అనడంతో ఇక చేసేది లేక ‘ఎస్’ అని చెప్పేసిందట. ఇక అనిల్ పట్టలేని సంతోషంతో కారు స్టార్ట్ చేసి రుయ్‌మన్నాడట. ఇలా అనిల్, నీతా అంబానీలు ప్రేమ ద్వారా జీవిత భాగస్వామ్యులయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu