Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాలంటైన్స్‌ డే బాహుబలి గ్రీటింగ్‌ కార్డులు!

మంగళవారం నాడు ప్రేమికుల దినోత్సవం పురస్కరించుకుని బాహుబలి టీమ్‌ కొత్త స్ట్రాటజీని మొదలుపెట్టింది. లైలా-మజ్ను, దేవదాసులు ప్రేమికుల చిహ్నంగా చెబుతుంటే.. ఇకపై దేవసేన, బాహుబలిలు గొప్ప ప్రేమికులుగా ప్రచారం

Advertiesment
వాలంటైన్స్‌ డే బాహుబలి గ్రీటింగ్‌ కార్డులు!
, సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (19:15 IST)
మంగళవారం నాడు ప్రేమికుల దినోత్సవం పురస్కరించుకుని బాహుబలి టీమ్‌ కొత్త స్ట్రాటజీని మొదలుపెట్టింది. లైలా-మజ్ను, దేవదాసులు ప్రేమికుల చిహ్నంగా చెబుతుంటే.. ఇకపై దేవసేన, బాహుబలిలు గొప్ప ప్రేమికులుగా ప్రచారం చేస్తున్నాడు రాజమౌళి. తన సినిమా ప్రమోషన్‌ను మరింతగా పెంచేందుకు ప్రేమికుల దినోత్సవం నాడు వారు కంకణం కట్టుకున్నారు.
 
బాహుబలి-2 అంతా వీరి ప్రేమ కథ మీదే నడవనుంది. అందుకే బాహుబలి టీమ్‌ ఈమధ్య విడుదల చేసిన అమరేంద్ర బాహుబలి, దేవసేనల పోస్టర్‌‌తో గ్రీటింగ్‌ కార్డు తయారుచేసి అందులో ఒక రొమాంటిక్‌ మెసేజ్‌‌ను సైతం పొందుపరిచి అందమైన వాలంటైన్స్‌ డే గ్రీటింగ్‌ కార్డును తయారు చేశారు. అందుకు 'బ్లాగ్‌ బాహుబలి.కామ్‌'కు వెళ్ళి డౌన్‌లోడ్‌ చేసేందుకు వీలుగా పెట్టింది. ప్రచారంలో ఇదో కొత్త పోకడను రాజమౌళి అనుసరిస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాలెంటైన్స్ డే నాడు అమ్మానాన్నలతో గడపండంటున్న కలెక్టర్.. ఎవరు..?