Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెండు మనసుల తియ్యటి కల... ప్రేమ!!

రెండు మనసుల తియ్యటి కల... ప్రేమ!!

Gulzar Ghouse

, శనివారం, 13 ఫిబ్రవరి 2010 (21:17 IST)
FILE
ప్రేమ అనే రెండక్షరాల మధురమైన శబ్దాన్ని వింటేనే అదో తియ్యటి అనుభూతి కలుగుతుంది. ప్రేమలో పడనివారు ప్రేమలో పడాలని తహతహలాడుతుంటారు. అదే ప్రేమలో పడినవారు ఆ ప్రేమను నిలబెట్టుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. ప్రేమ, లవ్, ఇష్క్, మొహబ్బత్, నేహ్, ప్రీతి, అనురాగ్, కోరిక, ఆషికీ. ప్రేమకు పలు పేర్లున్నాయి. ఏ పేరుతో పిలిచినా ప్రేమే...! ఆ ప్రేమ శబ్దమే చాలా అద్భుతమైన శబ్దం. ప్రేమ అనే రెండక్షరాల మధురమైన శబ్దానికి ప్రత్యామ్నాయం అనేది ఈ ప్రపంచంలోనే లేదంటారు ప్రేమికులు.

ప్రేమ రెండు మనసుల తియ్యటి కల. విడదీయరాని బంధమేదో ఇందులో దాగివుంది. ప్రేమించిన వారికే దీని విలువ తెలుస్తుంది. నులివెచ్చని నీరెండ అనుభూతిని ప్రసాదించే ఈ ప్రేమ కోసం ప్రేమికులు తపిస్తుంటారు. వెన్నెలలాంటి చల్లదనం ప్రేమలో దాగుంటుంది.

నిజమైన ప్రేమ అనేది శారీరక ఆకర్షణలో ఉండదు. ప్రేమకు అందంతో పని లేదు. ప్రేమ అనేది ఓ కల్పన. ప్రేమికుల మనసును దోచుకునేందుకు ప్రతి ప్రియుడు / ప్రియురాలు తహతహలాడుతుంటారు. ప్రేమికుల కళ్ళల్లో ఆ జిలుగు వెలుగులు మరెవ్వరిలోను కనపడదు. వారి చిరునవ్వు మనసును ఆహ్లాదపరుస్తుంటుంది. ప్రేమలో ఎన్నో రంగులు దాగున్నాయి.
webdunia
FILE


ప్రేమ అనేది పూ రేకులలాంటి సుతి మెత్తనైనది. కొందరి ప్రేమ గుండెల్లో ఉంటే, మరికొందరి ప్రేమ పుస్తకాల పేజీలలో దాగివుంటుంది. ప్రేమ అనేది ఏమైనా కావచ్చు. అది ఎప్పుడైనా పుట్టొచ్చు. దానికి వయసుతో సంబంధం లేదు. చివరికి ప్రేమకు లింగభేధం కూడా అడ్డు రాదు. ప్రేమలో ఒకరిపట్ల మరొకరికి నమ్మకం, విశ్వాసమే ప్రేమ.

webdunia
FILE
ప్రేమ అంటే ఇవ్వడమే కాని తీసుకోవడమనేది ఉండదు. ప్రేమ అనేది సర్వస్వం సమర్పించడమే. ఎంత సమర్పించుకున్నా ఇంకా వెలితిగానే ఉంటుంది. అదే ప్రేమంటే. తమ ప్రేమికులకు ఇంకా ఏదో ఇవ్వాల్సింది మిగిలిపోయిందనేది ప్రేమలో దాగివుంటుంది. ఇక్కడ స్వార్థం ఉండదు. మనం ఎంత ప్రేమించామనే దానికి కొలబద్ద ఏదీ ఉండదు. దానిని కిలోల లెక్కన తూచనూ లేము.
webdunia
FILE


ఒకరినొకరు చూసుకుంటూ మైమరచిపోవడమే ప్రేమ. ప్రేమ గుడ్డిదంటారు పెద్దలు. నిజంగా ప్రేమ గుడ్డిదే. ప్రేమకే గనుక కళ్ళు ఉంటే దానిని వ్యతిరేకించే వారు ఆ ప్రేమ అనే వాడి వేడి చూపులతో మాడి మసైపోతారు. అందుకే తమను తాము రక్షించుకునేందుకు ప్రేమ గుడ్డిది అంటుంటారు చాలా మంది. ప్రేమ గురించి తెలియని వారు మాత్రమే ఇలా వ్యాఖ్యానిస్తుంటారు. బైకులో తిరుగుతూ తమ ప్రేమికుడిని చుట్టుముట్టుకోవడం కాదు ప్రేమంటే. ఒకరినొకరు అర్థం చేసుకోవడమే ప్రేమంటే. ఒకరినొకరు గౌరవించుకోవడమే ప్రేమంటే.

webdunia
FILE
ప్రేమికుల రోజున అప్పు తీసుకుని మరీ గిఫ్ట్ కొనాల్సిన అవసరం లేదు. దీనిని ప్రేమ అనరు. మీ సంపాదనలో కనీసం ఒక రోజాపువ్వు ఇచ్చినా చాలు మీ ప్రియులకు. అదికూడా ప్రేమతో కలగలిపిన నిండైన ప్రేమ అందులో దాగుండాలి. అంతేకాని ఖరీదైన వస్తువు గిఫ్ట్‌గా ఇస్తేనే తమ ప్రేమను ఎదుటివారు అంగీకరిస్తారనుకోవడం మూర్ఖత్వం. ప్రేమను ఎన్ని పేర్లతో పిలిచినా చివరికి ప్రేమ..ప్రేమ..ప్రేమ. ప్రేమ ప్రేమగానే ఉంటుంది కాని దానికి మరో పేరును సూచించలేము. ప్రేమను వృక్షంలా పెరిగేందుకు రెండు మనసులలోను అంతరాలు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రేమికులపై ఉంది.

తమ ఇష్టమైన వారి ప్రేమ కోసం శరీరాలపై గాట్లు వేసుకోవడం, యాసిడ్‌లు పోయడం, ఆత్మహత్యలు చేసుకోవడంకాదు ప్రేమంటే. ఆ ప్రేమను బతికించుకునేందుకు ఇరువురు కలిసి ప్రేమగా వ్యవహరించాలి. ఒకరిని మరొకరు అర్థం చేసుకోవాలి. ఎదుటివారి బాధేంటో అర్థం చేసుకుని మరీ మసలుకోవాలి. అదే ప్రేమంటే.

Share this Story:

Follow Webdunia telugu