Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమ రసాయన శాస్త్రం.. పట్టు ఎంతో తెలుసా?!

ప్రేమ రసాయన శాస్త్రం.. పట్టు ఎంతో తెలుసా?!
WD
రసాయన శాస్త్రాన్ని అనుసరించి మనలో ప్రేమ భావనలు చెలరేగడానికి హృదయంతో పాటుగా మెదడు కూడా సహకరిస్తుంది. మెదడులో ఉత్పన్నమయ్యే డోపామైన్ అనే హార్మోన్ మనిషిలో శృంగారపూరిత తలంపులు కలిగించే బాధ్యతను తీసుకుంటుందని అమెరికాకు చెందిన మానసిక శాస్త్రవేత్త హెలెన్ ఫిషర్ పేర్కొన్నారు. అంతటితో ఆగక మనిషిలో తీవ్రమైన ఉత్తేజాన్ని డోపామైన్ కలిగిస్తుంది. ఇదంతా కూడా ప్రేమ సమీకరణలకు దారి తీస్తుంది.

ఇప్పటి వరకు హృదయం, గుండె చప్పుళ్లతో ప్రేమకు ఏదో తెలియని లంకె ఉంటూ వచ్చింది. అయితే ప్రేమ వెనుక దాగిన సంగతులు ఎన్నో ఉన్నాయి. తొలి చూపులోనే ప్రేమ కలుగుతుందని అనుభవజ్ఞులు చెప్పడంతో పాటు అనేక పుస్తకాలలో చదివి తెలుసుకున్నాము. తొలి చూపులోనే ప్రేమలో పడేందుకు డోపామైన్ కీలకమైన పాత్రను పోషిస్తుంది. ప్రేమ పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండటం తప్పనిసరి. ఉత్తేజాన్ని కలిగించినట్లుగా ప్రేమ పట్ల విశ్వాసాన్ని డోపామైన్ పాదుగొల్పుతుందా? ఇందుకు సంబంధించి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ప్రేమతో పాటు విశ్వాసం కూడా సహజసిద్ధంగా ఉద్భవిస్తుందని ప్రేమోపాసకులు పేర్కొంటున్నారు.

రసాయన శాస్త్రంలో ప్రేమ సమీకరణలు వెదుకుకోవలసిన అవసరం ఏముందని మీరు ప్రశ్నించవచ్చు? ప్రేమ తాలూకు పర్యవసనాలను ప్రతిబింబించే అనేక సంఘటనలను మనం నిత్య జీవితంలో చూస్తుంటాం. వాటిల్లో స్వార్థమెరుగని ప్రేమ ఘటనలు మన దృష్టికి వచ్చి ఉండవచ్చు. అదేసమయంలో అటువంటి ప్రేమకు భవిష్యత్తు ఎలా ఉంటుందనేది చెప్పడం కష్టం. ఈ నేపథ్యంలో జపాన్‌లో జరిగిన సంఘటనను మనం ఇక్కడ తెలుసుకుందాం. ప్రేమకు భౌగోళిక హద్దులు లేవని తెలపాలంటే రెండు రోజుల సుధీర్ఘమైన ఉపన్యాసం అవుతుంది.

ఇవాళ జపాన్‌లో జరిగింది రేపు భారత్‌లో జరిగే అవకాశం లేదని చెప్పలేం. ఈ సంఘటన ఎక్కడైనా జరగవవచ్చు. 25 సంవత్సరాల దొంగ ఒకడు జపాన్‌లోని పోస్టాఫీస్‌ నుంచి 3,40,000 యెన్‌ల ధన రాశిని దొంగలించాడు. ఈ సంగతి దొంగ ప్రియురాలికి తెలిసింది. తన వ్యవహారం ప్రేమికురాలికి తెలిసిపోయిందన్న సంగతి దొంగకు తెలిసింది. ప్రేమను కోల్పోవడం ఆ దొంగకు ఇష్టంలేదు. అందుకే తన వృత్తికి విరుద్ధంగా ప్రేమికులకు ఆదర్శంగా నిలిచే రీతిలో ఆ దొంగ ఒక పని చేశాడు. తాను దొంగలించిన 3,40,000 యెన్‌ల ధన రాశికి మరో 10,000 యెన్‌లను జోడించి మొత్తం ధనాన్ని పోస్టాఫీస్‌లో చేరవేసి వచ్చేశాడు మన ప్రేమ దొంగ. ప్రేమ అంటే రెండు హృదయాలు కలయిక మాత్రమే కాదు ఒకరిపై ఒకరికి విశ్వాసాన్ని పాదుగొలిపి ప్రేమికుల్లో బాధ్యతను పెంచే మహా మంత్రంగా చెప్పవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu