Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియురాలికి ఎన్ని ముద్దులో....

Advertiesment
కనులపై కమ్మని ముద్దు బట్టర్ ఫ్లై కిస్ చెవిపై చిన్నముద్దు చేతివేళ్లపై నునువెచ్చని ముద్దు
లోకాన్ని మైమరిచి ప్రేమికులు విహరించేది ముద్దుల లోకంలోనే అంటున్నాడు "కిస్సుల్లో కింగ్" అని బిరుదు తెచ్చుకున్న ఓ ప్రేమికుడు. ఈ ముద్దులు ఎన్నో... ఎన్నెన్నో ఉన్నాయంటున్నాడు. అతను చెప్పిన కొన్ని ముద్దుల వివరాలు ఒకసారి చూద్దామా....

WD
చిన్ని గడ్డంపై: ప్రియుడు ప్రియురాలికి ఎంతో గోముగా అందమైన చుబుకంపై ఇచ్చే తీయనైన ముద్దు

కనులపై కమ్మని ముద్దు: ప్రేమలోకంలో విహరించే సమయంలో రెండు కనులపై పెదవులతో ఇచ్చే ముద్దు కమనీయంగా ఉంటుందట.

webdunia
WD
చెవిపై చిన్నముద్దు: తమ ఇష్టసఖి/సఖునికి చెవిపై మెల్లగా స్పర్శిస్తూ ఇచ్చే ముద్దు మహా మత్తెక్కిస్తుందట.

బట్టర్ ఫ్లై కిస్: ఈ ముద్దు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరే లేదు. రెండు పెదవులు బిగించి... ప్రేయసి/ప్రియుడి పెదవులను లాక్ చేసేయడేమనట.

webdunia
WD
చేతివేళ్లపై నునువెచ్చని ముద్దు: ప్రియురాలి చేతివేళ్లను పెదవులతో స్పృశిస్తూ ఇచ్చే ముద్దు ఎప్పటికీ మరువలేనిదిగా ఉంటుందట.

నుదుటిపై నునులేత ముద్దు: నుదుటిపై ఇచ్చే ముద్దు ప్రేమ సామ్రాజ్యాన్ని జయించినతం ఆనందాన్నిస్తుందట.

webdunia
WD
లెటర్ కిస్: ప్రియురాలు/ప్రియుడు దూరతీరాల్లో ఉన్నప్పుడు ఉత్తరంపై వారివారి పెదవుల ముద్రికలను వేసి పోస్ట్ చేసిన లెటర్ కిస్ వారికి కొత్త స్టామినాను ఇస్తుందట.

వర్చువల్ కిస్: ఇక ఉత్తరాలు, ఫోన్లు కాదని ఇంటర్నెట్ ద్వారా సర్‌ప్రైసింగ్ ముద్దును కూడా ఇవ్వచ్చట. ఇ-కార్డు ద్వారా ప్రియుడు/ప్రియురాలు తమ ముద్దులను ఇమెయిల్ ద్వారా అందించవచ్చు.

ఇంతటితో ముద్దులు అవలేదు. ఇంకెన్నో ఘాటైన ముద్దులు ప్రేమికుల ఖాతాలో ఉన్నాయట. అవి ప్రేమికులకు మాత్రమే తెలుసట.

Share this Story:

Follow Webdunia telugu