Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బడ్జెట్ 2013-14 మహిళా బ్యాంకు... బల్లలు చరిచిన సుష్మా, సోనియా

బడ్జెట్ 2013-14 మహిళా బ్యాంకు... బల్లలు చరిచిన సుష్మా, సోనియా
, గురువారం, 28 ఫిబ్రవరి 2013 (18:24 IST)
FILE
కేంద్ర బడ్జెట్ 2013-14లో మహిళలకు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం రూ. 1000 కోట్ల మూలధనంతో ప్రభుత్వ రంగ మహిళా బ్యాంక్‌కు పీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిదంబరం ప్రకటనతో విపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, యూపీఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ బల్లలు చరిచి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ప్రతి బ్యాంకుకు ఏటీఎం తప్పనిసరిగా ఉంటుందని చిదంబరం ప్రకటన చేశారు. ఈ ప్రకట రాగానే ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ హర్షం వ్యక్తం చేశారు. అంతేగాకుండా సభలో చప్పట్ల శబ్ధం మారుమోగింది.

బడ్జెట్ ముఖ్యాంశాలు:
* రహదారి ప్రాజెక్టు కోసం ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ
* గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీల్లో 3వేల కి.మీ రోడ్ల నిర్మాణం
* రూ. 24లక్షల వరకు గృహ రుణం పొందేవారికి రూ. లక్షవరకు అదనపు రాయితీ
* ఆహార భద్రత బిల్లుకు పదివేల కోట్లు
* 2014 నాటికి అన్ని సహకార బ్యాంకులకి ఏటీఎంలు
* పొదుపు పథకాలకు మరింత ప్రోత్సాహం
* గృహ నిర్మాణ వడ్డీ రేట్లలో అదనపు తగ్గింపులు.. తొలిసారి గృహ రుణం తీసుకున్న వారికి వర్తింపు
* గృహరుణాలపై వడ్డీ మినహాయింపు లక్షన్నర నుంచి రూ. 2.5 లక్షలకు పెంపు

Share this Story:

Follow Webdunia telugu