Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉగాది రోజున ఇవి చేయకూడదు.. క్రోధి నామ సంవత్సరం...

Advertiesment
Ugadi 2024 Check Date

సెల్వి

, సోమవారం, 8 ఏప్రియల్ 2024 (14:07 IST)
ఉగాది రోజున ఆలస్యంగా నిద్ర లేవడం మంచిది కాదు. ఈ పర్వదినాన ఆల్కహాల్, సిగరేట్, మాంసాహారాలు ముట్టకూడదు. ముఖ్యంగా పంచాంగ శ్రవణాన్ని దక్షిణం ముఖాన కూర్చొని చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవీ అనుగ్రహం ఉండదని పురాణాలు చెబుతున్నాయి. 
 
ఉగాది రోజు మనం ఏ పనిచేస్తామో సంవత్సరం మొత్తం అవే పనులు చేస్తామని పెద్దల నమ్మకం. కాబట్టి ఈ రోజు మంచి పనులు చేయడానికి ప్రయత్నించాలి. విష్ణువు మత్యావతారంలో సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన రోజునుండే ఉగాది పండగ జరుపుకోవడం ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. 
 
శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదే. ఈ రోజు నుండే శాలివాహన శకం ప్రారంభమైందని చెబుతారు. ఉత్తరాయన, దక్షిణాయన అను ద్వయాలు కలిస్తేనే యుగం.. సంవత్సరం అవుతుంది. దీనికి ఆది యుగాది.  
 
తెలుగు నామ సంవత్సరాలు అరవై. అవి ప్రతియేడు ఒక క్రమంలో వస్తాయి. ఈసారి వచ్చే క్రోధి నామ సంవత్సరం 38వది. భక్తులు ఉగాది సందర్భంగా భక్తులు, ఆయురాగోగ్యాలు, సుఖ సంతోషాలు, సౌభాగ్యం, కలగాలని విజయం కోసం భగవంతుని ఆశీస్సులు పొందాలి.
 
ఉదయం అభ్యంగన స్నానంతో మొదలైన ఈ పండుగ సాయంత్రం పంచాంగ శ్రవణంతో ముగుస్తుంది. ఉగాదినాడు పంచాంగ శ్రవణం తప్పని సరిగా వినాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉగాది పచ్చడిలో నవగ్రహ కారకాలు.. కొత్తబట్టలు తప్పనిసరి