ఇటీవల కాలంలో బుల్లితెరకు జనాకర్షణ పెరుగుతోందంటే కారణం రియాల్టీ షోలు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అందులోను వైవిధ్యంతో కూడిన నృత్య పోటీలకు విపరీతమైన క్రేజ్ ఇటీవలే వచ్చింది. తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇలాంటి డ్యాన్స్ షోలలో గత కొంత కాలంగా 'ఆట' కార్యక్రమం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.సక్సెస్‌ఫుల్ రియాల్టీ షో.. 'అట-3' |
|
ఈ రియాల్టీ కార్యక్రమం ఒక రకంగా ఓ యుద్ధాన్ని తలపించే రీతిలో నడుస్తుందని చెప్పొచ్చు. జడ్జి, అడ్వైజర్లు, పోటీదారుల మధ్య అభిప్రాయాలు ఇందుకు కారణమవుతాయి. అందుకే ఈ కార్యకమంకోసం... |
|
|
అందుకే ఈ కార్యక్రమం ఇప్పటికే ఆట-1, ఆట-2లను విజయవంతంగా పూర్తి చేసుకుని ఆట-3లోకి అడుగుపెట్టి అదే విజయపరంపరతో నడుస్తోందంటే.. బుల్లితెర ప్రేక్షకుల్లో దీనికున్న క్రేజ్ ఏపాటిదో అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రకాల డ్యాన్సులలో ప్రతిభ ఉన్న వారిని వెలికి తీసి ప్రోత్సహించడం కోసమే ఈ కార్యక్రమాన్ని జీటీవీ ఛానెల్ ప్రవేశపెట్టింది.
ప్రస్తుతం ఆట-3 కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు ప్రధాన కేంద్రాల్లో ఉన్న ప్రతిభావంతులను ఎంపిక చేసి వారిలో నటరాజు, నటరాణిలను గుర్తించి తగిన బహుమతులతో సత్కరిస్తారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఈ షోలో జడ్జిగా ప్రధాన పాత్రలో ఉంటారు. సినిమా, బుల్లితెరలపై ప్రముఖ తారలుగా ఉన్న టినా, నటరాజ్, వేణు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనే పోటీదారులకు డ్యాన్స్‌లో సలహాలనిచ్చే అడ్వైజర్లుగా ఉంటారు.
ఈ అడ్వైజర్లు పోటీకి కీలకమైన జడ్జిమెంట్ సమయంలోను పాలుపంచుకుంటారు. అయితే తుది నిర్ణయం మాత్రం మహా గురుగా ఉండే జడ్జే నిర్ణయిస్తారు. ఈ జడ్జిగా సుందరమ్ మాస్టారు ఉండటం విశేషం. జగదేక వీరుడు- అతిలోక సుందరి వంటి హిట్ చిత్రాలకు సుందరం మాస్టారు కొరియోగ్రఫీ చేశారు.
సుందరం మాస్టారు జడ్జిమెంట్‌లో ఆయన తనయుడు ప్రసాద్ సాయంగా ఉంటారు. కన్నడ చిత్రాల హీరో, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌గా బహుముఖ పాత్రలను పోషిస్తున్న ప్రసాద్ తాజాగా జడ్జికి సాయకుడిగాను అవతారమెత్తారు. ఈ పోటీలో మహా గురు ఇచ్చే తీర్పే తుది నిర్ణయం. కానీ, ఈ నిర్ణయంలో అడ్వైజర్ల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది.
దీని ప్రకారం ఈ రియాల్టీ కార్యక్రమం ఒక రకంగా ఓ యుద్ధాన్ని తలపించే రీతిలో నడుస్తుందని చెప్పొచ్చు. జడ్జి, అడ్వైజర్లు, పోటీదారుల మధ్య అభిప్రాయాలు ఇందుకు కారణమవుతాయి. అందుకే ఈ కార్యకమంకోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ కార్యక్రమం జీ-తెలుగులో ప్రతి సోమ, మంగళవారాల్లో రాత్రి 9.00 గంటలకు ప్రసారమవుతుంది. ఆట-3ను చూసి ఎంజాయ్ చేయండి మరి.