ఈ జాబితాలో ఇప్పుడు 7/జి బృందావని కాలని భామ సోనియా అగర్వాల్ చేరిపోయింది. ఖుష్బూ నిర్మిస్తున్న తాజా సీరియల్‌లో నటిస్తోంది. అందరూ చెప్పే పద్ధతిలోనే సీరియల్‌లో తను పోషిస్తున్న పాత్ర సినిమాలలో నటిస్తున్న పాత్రలకు ఏమాత్రం తీసిపోదని కహానీలు వల్లెవేస్తోంది. ఏం చేద్దాం అందినదానితోనే సంతృప్తి చెందక తప్పదు కదా.
పెద్దతెరపై అందాలు ఆరబోసి... ప్రేక్షకులను కట్టిపడేసిన సెక్సీతారలు పెళ్లితో దఢేల్‌మని బుల్లితెర స్థాయికి పడిపోతున్నారు. ఐతే ఐశ్వర్యారయ్ వంటి ప్రపంచ సుందరికి ఇది వర్తించదనుకోండి. ముఖ్యంగా దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగిన నటీమణులు వివాహం చేసుకున్న వెంటనే బుల్లితెర సీరియల్ నిర్మాతలు తమ సీరియల్స్‌లో ఛాన్సులు ఇస్తామని వారికి ఫోన్ చేసేస్తున్నారు.
ఈ పిలుపు అందగత్తెలకు కోపాన్ని, చికాకును తెప్పిస్తోంది. ఒళ్లు మండి ఫోను చేసిన వారికి ఎడాపెడా చివాట్లు పెట్టేస్తున్నారట. చివాట్లు తిన్నవారిలో ఓ బుల్లి నిర్మాత ఇలా చెప్పుకొచ్చాడు. "మాకేం తక్కువ. ఐశ్వర్యరాయ్ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ హీరోయిన్‌గా నెట్టుకొస్తుంది కదా. మాకు సైతం అంతటి పవర్ ఉంద"ని ఒక తార ముఖం మీదే చెప్పేసిందంటున్నాడు.
పెళ్లయిన తారలనుంచి మొదట్లో ఇటువంటి ఛీత్కారాలు తమకు అలవాటేననీ, క్రమంగా పరిస్థితి అర్థం చేసుకుని వారికివారే బుల్లితెర సీరియల్‌లో ఛాన్సులకోసం తనను సంప్రదించిన సందర్భాలు చాలా ఉన్నాయని అంటున్నాడు. మొత్తమ్మీద చూస్తే పెళ్లయితే... నటీమణుల దారి బుల్లితెరవైపే అని తెలుస్తోంది. అయినా అక్కడా పైకం బాగానే గుంజుతున్నట్లు వినికిడి.