Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జనాదరణ పొందుతోన్న 'మొగలిరేకులు'

Advertiesment
జనాదరణ మొగలిరేకులు సీరియల్ పూలు
FileFILE
పరిమళాలను గుప్పున వెదజల్లే 'మొగలి రేకులు'.. పూలల్లో ఒక రకమైన జాతి అన్న విషయం మనకు తెలిసిందే. సాధారణంగా పూలను సున్నితత్వంతో సరిపోలుస్తాం. అలాగే ఈ 'మొగలి రేకులు' కూడా సువాసనలిస్తాయి. సున్నితత్వాన్ని కూడా కలిగి ఉంటాయి. కానీ పూల చుట్టూ ముల్లు ఉంటాయి. పైగా ఈ పూల పొదల్లో పాములు కూడా వచ్చి చేరుతుంటాయని తెలిసిందే.

దాని ప్రకారమే.. ఈ సీరయల్ కథ కూడా ఉంటుంది. ముళ్లు అనే సమస్యలు ప్రేమ, ప్రశాంతతలకు అవరోధంగా నిలుస్తుంటే.. ఆ సమస్యలను సృష్టించేందుకు పాములు అప్పుడప్పుడు జీవితాల్లోకి ప్రవేశిస్తుంటాయి. కథకు దగ్గరగా ఉందనే ఉద్దేశ్యంతోనే 'మొగలి రేకులు' అనే టైటిల్ పెట్టడం జరిగింది.

పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేమ కథను మిళితం చేస్తూ యువత భావాలకు దగ్గరగా ఈ సీరియల్ నడుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు యువతీ యువకుల మధ్య జరిగే కథే ఈ సీరియల్. వీరి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలు, ప్రేమ, త్యాగం, హింస, ఈర్ష్య, ద్వేషం, బాధ్యతలను మిళితం చేస్తూ దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు.

ప్రస్తుతం నడుస్తున్న సీరియల్స్‌లో ఇది కూడా చక్కటి జనాదరణ పొందుతోంది. ఈ సీరియల్‌లో ట్విస్ట్‌లు... ప్రేక్షకులను కాస్తంత థ్రిల్‌కు గురిచేస్తుంటాయి. ఆదివారం తప్ప ప్రతి రోజు 08.30 గంటలకు జెమినీ టీవీలో ఈ సీరియల్ ప్రసారమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu