Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిన్నపిల్లలతో 'సరిగమప లిటిల్ ఛాంప్స్'

చిన్నపిల్లలతో 'సరిగమప లిటిల్ ఛాంప్స్'
FileFILE
సంగీతం ఓ అద్భుతమైన కళ. సంగీతాన్ని పూర్తిగా అభ్యసించాలన్నా లేదా తెలుసుకోవాలన్నా ఒక వ్యక్తి సంపూర్ణ జీవితం సరిపోదు. అందులో ఎంత లోతుందో అర్థం చేసుకోవడం కూడా కష్టమేమరి. దీన్ని బట్టి సంగీతాన్ని నేర్చుకున్న వారు ఆ కళలో పూర్తి స్థాయి నిష్ణాతులు అని ఖచ్చితంగా చెప్పలేం. నిష్ణాతులైనా నేర్చుకోవలసింది ఇంకా ఉండనే ఉంటుంది.

'సంగీతం' అదో అందమైన ప్రవాహం... ఆ ప్రవాహంలో కలిసి పోవాలని ఎంతో మంది సంగీత ప్రేమికులు ఆశిస్తారు. తపిస్తారు. నిత్యం జపిస్తారు. అయితే ఈ ప్రవాహంలో అనేక సంప్రదాయాలున్నాయి. విధానాలున్నాయి. ఏ సంప్రదాయమైనా, విధానమైనా స్వచ్ఛమైన సంగీతాలాపనే తుది రూపమవుతుంది.

సంగీత ప్రేమికుల్లో చిన్న, పెద్ద అంతరాలు ఏవీ ఉండవు. బాగా చిన్న వయసున్న పిల్లలు, 30 ఏళ్ల అనుభవమున్న గాయకుల్లా పాటలు పాడుతుంటే ఎక్కడైనా ఆశ్చర్యంగా చూస్తారు. ఆనందం నిండిన కళ్లతో మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. ఆ విధంగా ఉండేలా చిన్న పిల్లలతో ఓ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ కార్యక్రమమే సరిగమప లిటిల్ ఛాంప్స్.

జీటీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 3వేల మందికి పైగా పిల్లలు పోటీ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా.. చెన్నై, బెంగుళూరు వంటి ప్రధాన నగరాల నుంచి ఎంతో ఆసక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొంటున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో తమ పాటలతో వైవిధ్యాన్ని ప్రదర్శించిన 24 మందిని ఉత్తమ గాయనీగాయకులుగా ఎంపిక చేస్తారు.

వీరందరకీ కూడా ప్రత్యేక బహుమతులను జీటీవీ అందజేస్తుంది. కోటి, భువన చంద్ర, ఉష వంటి సినీ రంగ ప్రముఖులు ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తుండటం విశేషం. ఈ పోటీలో పాల్గొంటున్న పిల్లలకు.. వారు చేస్తున్న తప్పులను తెలిపి ఎలా వాటిని ఆధిగమించాలో మెళకువలు కూడా చెప్పడం కొసమెరుపు.

Share this Story:

Follow Webdunia telugu