ప్రముఖ మ్యూజిక్ ఛానెల్ ఎంటీవీకి చెందిన కొత్త అడ్వెంచర్ రియాల్టీ షో 'రోడీస్'ను హిందీ సినీ నటుడు అక్షయ్ కుమార్ ప్రారంభించారు. ఈ షో (కమాండో అబ్‌స్టాకిల్) తొలి విభాగంలో పాల్గొనడానికి సుమారు 20 మందికి పైగా పోటీదారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం జనవరి 10 శనివారం రాత్రి 7 గంటలకు ఎంటీవీలో ప్రసారమవుతుంది. ఎంటీవీ ఇండియా జనరల్ మేనేజర్ మరియు ఉపాధ్యక్షుడు ఆశీష్ పాటిల్ మాట్లాడుతూ, క్రిందటి ఏడాది తాము నిర్వహించిన హీరో హోండా రోడీస్-హెల్ డౌన్ అండర్ షో పిల్లల చిత్రంలా ఎంతో ఆసక్తిని రేకెత్తించేదిగా సాగిందని తెలిపారు.
తాజాగా అక్షయ్‌చే భారీ ఎత్తున తాము ప్రారంభించిన ఈ షో ఈ సీజన్‌లో అతి పెద్ద హిట్టవుతుందన్నారు. అలాగే గత షో కన్నా ఈ షోకు రెండు రెట్లు అధిక ప్రైజ్‌మనీని అందించనున్నట్లు ఆశిష్ తెలిపారు. ఇందులో పాల్గొంటున్న పోటీదారులు న్యూఢిల్లీ నుంచి ఉదయ్‌పూర్, అహ్మదాబాద్, సిల్వసా వంటి నగరాలకు ప్రయాణిస్తారని చెప్పారు.