Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘దేవతలారా దీవించండి’: అతనికి ఆడవాళ్లంటే అలుసు- కానీ ఆమెకి అతని మీదే మనసు

Devathalara Deevinchandi
, శనివారం, 30 ఏప్రియల్ 2022 (17:50 IST)
కళ్యాణం కమనీయంతో గుండెకు హత్తుకునేలా ఒక తల్లీ కూతుర్ల కథని మనముందుకి తెచ్చిన జీ తెలుగు మరొక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు - 'దేవతలారా దీవించండి’ ని తీసుకొస్తుంది. మీరు మీ టీవీ సెట్లకు పూర్తిగా అతుక్కుపోయేలా చేయడానికి జీ తెలుగు సర్వం సిద్ధం చేసుకుంది. ఇందులో శ్రీవల్లిగా చైత్రా సక్కరి, సామ్రాట్‌గా యశ్వంత్, భవానీగా నిరోషా నటిస్తున్నారు. అణకువ గల ఒక అమ్మాయి శ్రీవల్లి, అహంకార స్వభావం కలిగిన అబ్బాయి సామ్రాట్‌ల మధ్య జరిగే   సన్నివేశాలు ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మే నెల 2వ తేదీన ప్రీమియర్‌గా ప్రదర్శించబడే 'దేవతలారా దీవించండి’ జీ తెలుగులో సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రసారమవుతుంది. 

 
జీవితమంతా ఉల్లాసభరితంగా ఉండాలని కోరుకునే ఒక సాధారణమైన అమ్మాయి శ్రీవల్లి. కాబట్టి జీవితంలో జరిగే ప్రతి విషయములోనూ మంచినే కనుక్కోవడానికి ప్రయత్నించే ఆమెలోని సానుకూల స్వభావం మనకు ఇందులో కనిపిస్తుంది. వాస్తవానికి, తన కుటుంబ సభ్యులే ఆమెను నష్టజాతకురాలిగా భావించిన తర్వాత కూడా, తనలాగా ఆలోచించే మంచి అందగాడు, అర్థం చేసుకునే అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలని ఆమె కోరుకుంటుంది.

 
దురదృష్టం వెక్కిరిస్తూ, తాను ఊహించిన కలల రాజకుమారుడు అనిపించేలా కనిపించిన సామ్రాట్ అనే అబ్బాయిని ఆమె కలుసుకుంటుంది. ఆమె అతనితో ప్రేమలో పడినప్పటికీ, అమ్మాయిలంటే గౌరవం లేని అతని స్వభావం ఆమె అతి త్వరగానే గ్రహిస్తుంది, వారిద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటే ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠత ప్రేక్షకులకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది! వాస్తవానికి, అతని తల్లి భవాని సైతమూ తన కొడుకు గురించి చాలా భయపడుతుంటుంది.  

 
తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చలనచిత్ర మరియు టీవీ రంగాల వ్యాప్తంగా 100కు పైగా చిత్రాలలో నటించిన గతకాలపు తార నిరోషా కూడా, అనేక సంవత్సరాల తర్వాత 'దేవతలారా దీవించండి'తో తెలుగు ధారావాహికలకు తిరిగి తెరపైకి వచ్చింది. తన కొడుకు గురించి భయాందోళన చెందే నిరాడంబరమైన స్త్రీ అయిన భవాని పాత్రను ఆమె పోషించబోతోంది. ఆమె పాత్ర అనేక మలుపులతో ఉంటుంది, ఐతే అది ప్రతి ఒక్కరి మనసులనూ కచ్చితంగా మెప్పించే ఆమె ఉత్తమ ప్రదర్శనగా ఉంటుంది.

 
ఈ సరికొత్త ధారావాహిక 'దేవతలారా దీవించండి’ మే నెల 2 వ తేదీ నుండి సాయంత్రం 6.30 గంటలకు ప్రసారం కాబోతుంది,'క్రిష్ణ తులసి' మే నెల 2వ తేదీ నుండి మధ్యాహ్నం 12 గంటలకు మార్చబడింది. కొత్త సీరియల్ యొక్క ప్రారంభం గురించి మాట్లాడుతూ, తెలుగు ఛీఫ్ కంటెంట్ అధికారి అనురాధా గూడూర్ గారు ఇలా వెల్లడించారు, “జీ తెలుగులో మేము, మా వీక్షకుల కోరికలను ముందువరుసలో ఉంచాలని ఎల్లప్పుడూ లక్ష్యంగా చేసుకుంటాము. వారికి మరింత వినోదాన్ని అందించడానికి మే నెల 2 వ తేదీన సరికొత్త ధారావాహిక - 'దేవతలారా దీవించండి’ ని ప్రారంభిస్తున్నాము. ఈ సీరియల్ రెండు వేరు వేరు మనస్తత్వాలు గల ఇద్దరు వ్యక్తుల చుట్టూ తిరుగుతూ, తన కథలోని భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టి పడేస్తుంది."

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ‌హేష్‌బాబుకు మ్యూజిక్ సెన్స్ వుంది - థ‌మ‌న్‌