పరిమళాలను గుప్పున వెదజల్లే 'మొగలి రేకులు'.. పూలల్లో ఒక రకమైన జాతి అన్న విషయం మనకు తెలిసిందే. సాధారణంగా పూలను సున్నితత్వంతో సరిపోలుస్తాం. అలాగే ఈ 'మొగలి రేకులు' కూడా సువాసనలిస్తాయి. సున్నితత్వాన్ని కూడా కలిగి ఉంటాయి. కానీ పూల చుట్టూ ముల్లు ఉంటాయి. పైగా ఈ పూల పొదల్లో పాములు కూడా వచ్చి చేరుతుంటాయని తెలిసిందే.
దాని ప్రకారమే.. ఈ సీరయల్ కథ కూడా ఉంటుంది. ముళ్లు అనే సమస్యలు ప్రేమ, ప్రశాంతతలకు అవరోధంగా నిలుస్తుంటే.. ఆ సమస్యలను సృష్టించేందుకు పాములు అప్పుడప్పుడు జీవితాల్లోకి ప్రవేశిస్తుంటాయి. కథకు దగ్గరగా ఉందనే ఉద్దేశ్యంతోనే 'మొగలి రేకులు' అనే టైటిల్ పెట్టడం జరిగింది.
పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేమ కథను మిళితం చేస్తూ యువత భావాలకు దగ్గరగా ఈ సీరియల్ నడుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు యువతీ యువకుల మధ్య జరిగే కథే ఈ సీరియల్. వీరి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలు, ప్రేమ, త్యాగం, హింస, ఈర్ష్య, ద్వేషం, బాధ్యతలను మిళితం చేస్తూ దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు.
ప్రస్తుతం నడుస్తున్న సీరియల్స్‌లో ఇది కూడా చక్కటి జనాదరణ పొందుతోంది. ఈ సీరియల్లో ట్విస్ట్‌లు... ప్రేక్షకులను కాస్తంత థ్రిల్‌కు గురిచేస్తుంటాయి. ఆదివారం తప్ప ప్రతి రోజు 08.30 గంటలకు జెమినీ టీవీలో ఈ సీరియల్ ప్రసారమవుతుంది.