Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోడీ మాటకారి... చేతలు శూన్యం : మంత్రి యనమల

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏపీ సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడీ ఓ మాటకారి అంటూ ధ్వజమెత్తారు. అంతేకాకుండా, ఆయన మాటలే చెబుతారు తప్ప చేతలు శూన్యమనేది రుజువైందని అన్నారు.

Advertiesment
మోడీ మాటకారి... చేతలు శూన్యం : మంత్రి యనమల
, సోమవారం, 9 ఏప్రియల్ 2018 (16:13 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏపీ సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడీ ఓ మాటకారి అంటూ ధ్వజమెత్తారు. అంతేకాకుండా, ఆయన మాటలే చెబుతారు తప్ప చేతలు శూన్యమనేది రుజువైందని అన్నారు. 
 
ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ టీడీపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా చేసుకుని ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఆదివారం ప్రధాని అధికారిక నివాసం ఎదుట మెరుపు ధర్నా చేసిన టీడీపీ ఎంపీలను నిర్దాక్షిణ్యంగా లాగిపారేశారు. 
 
దీనిపై మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఏపీలో 2014లో వచ్చిన ఓట్లలో పదో వంతు ఓట్లు కూడా రావన్నారు. ప్రధాని మోడీ నాలుగేళ్లలో పేదలకు, మధ్య తరగతికి చేసిందేమీ లేదని, బీజేపీ బలపడుతుందని ఆ పార్టీ నేతలు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 
 
నాటకాలలో బీజేపీది అందవేసిన చెయ్యని, ఏపీని, టీడీపీని విమర్శించడానికే జీవీఎన్‌ నరసింహారావుని బీజేపీ రాజ్యసభకు పంపినట్లుందని వ్యాఖ్యానించారు. చట్టంలో పొందు పర్చిన అంశాలను అమలు చేయమంటే బీజేపీకి ఎందుకంత కోపం వస్తుందని యనమల ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ నిరాహారదీక్షలు... కడుపునిండా పూరీలు ఆరగించిన నేతలు