Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్బేనియా ఏఐ మంత్రి డియోల్లా గర్భం దాల్చింది.. 83 మంది ఏఐ పిల్లలు పుట్టబోతున్నారట! (video)

Advertiesment
AI minister

సెల్వి

, సోమవారం, 27 అక్టోబరు 2025 (21:44 IST)
AI minister
అల్బేనియా దేశానికి చెందిన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మంత్రి డియెల్లా గర్భం దాల్చిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని ఎడి రేమా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.  అంతేకాదు త్వరలోనే ఆమె 83 మంది ఏఐ పిల్లలకు జన్మనివ్వనుందని తెలిపి మరింత షాకిచ్చారు. ఎడి రేమా జర్మనీలోని బెర్లిన్‌లో జరిగిన గ్లోబల్ డైలాగ్ సదస్సులో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఈ విచిత్రమైన ప్రకటన చేశారు. తాము డియెల్లాతో సాహసం చేశామని, తొలిసారిగా డియెల్లా గర్భవతి అయింది. అదీ 83 మంది పిల్లలను జ‌న్మనివ్వనుందని ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ఈ 83 మంది ఏఐ పిల్లలు పార్లమెంటులోని సోషలిస్ట్ పార్టీకి చెందిన 83 మంది ఎంపీలకు డిజిటల్ సహాయకులుగా పనిచేస్తారని కూడా ఆయన ప్రకటించడం సంచలనానికి దారి తీసింది. పార్లమెంటు కార్యకలాపాలను పూర్తిగా రికార్డ్ చేయడం, ఏదైనా కారణంతో సమావేశానికి హాజరుకాలేకపోయిన ఎంపీలకు సమాచారం అందించడం వీరి పని అని ఆయన వివరించారు. 
 
ఈ పిల్లలు సభలో సభ్యులు కాఫీలు తాగడానికి వెళ్తే.. వారు వచ్చిన తర్వాత ఏం జరిగిందో చెప్తారు. అంతేగాకుండా ప్రత్యర్థులకు ఎలా కౌంటరివ్వాలో కూడా చెప్తాయని వెల్లడించారు. అల్బేనియా భాషలో డియెల్లా అంటే సూర్యుడు అని అర్థం. ఈ ఏడాది జనవరిలో ప్రధాని ఎడి రేమా ఈమెను తొలి ఏఐ మంత్రిగా పరిచయం చేశారు. ఈ -అల్బేనియా ప్రభుత్వ పోర్టల్‌లో ప్రజలకు డిజిటల్ సేవలు అందించడంలో ఈ డిజిటల్ అసిస్టెంట్ సహాయం చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)