Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జంగిల్ సఫారీలో టూరిస్టులకు చుక్కలు.. తరుముకున్న పులి (video)

tiger
, సోమవారం, 28 నవంబరు 2022 (19:20 IST)
పులి అంటేనే అయ్య బాబోయ్ అంటూ జడుసుకుంటాం. అలాంటిది మీటర్ల దూరంలో పులి గర్జిస్తూ కనిపిస్తే.. ఆ భయంతోనే గుండె ఆగిపోయే పని అవుతుంది. అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

అవును మీరు చదువుతున్నది నిజమే. తాజాగా  ఓ జంగిల్ సఫారీలో ఇదే సంఘటన టూరిస్టులకు ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. జంగిల్ సఫారీలో ఓపెన్ జీప్‌లో ప్రయాణీస్తున్న బృందం వైపు కోపంతో గాండ్రిస్తూ పులి ఎగబడింది.
 
ఈ భయానక వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సురేందర్ మెహ్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పర్యాటక బృందం ఓపెన్ జీప్‌లో వెళ్తూ పొదలు వెనుక పులి వున్నట్లు గుర్తించి వాహనం ఆపారు. 
 
పులి కదలికలను దగ్గర నుంచి చిత్రీకరించేందుకు ప్రయత్నించడంతో ఆ జంతువు వారిపైవు  గర్జిస్తూ కోపంగా దూసుకొచ్చింది. ఆ క్షణంలో అప్రమత్తమైన జీప్ డ్రైవర్ వాహనాన్ని ముందుకు  పోనివ్వడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ వీడియోకు లైకులు, కామెంట్లు పెడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విదేశాల నుంచి తండ్రి తెచ్చిన చాక్లెట్.. ఊపిరాడక బాలుడి మృతి